బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ఈటల రాజేందర్ కు ఆత్మీయ సత్కారం చేశారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. నా జీవితం తెరిచిన పుస్తకమని, నాలాంటి వాడు ఎలాంటి పదవిలో ఉన్నా.. నిజమైన అర్హులకు లబ్దిచేకూర్చే పని చేస్తున్న. నేను మీ కుటుంబంలో సభ్యున్ని అని ఆయన అన్నారు. మీ ఆశీర్వాదం కావాలని కోరుతున్న. అదే నాకు కొండంత అండ. మీ దగ్గర డబ్బులు లేకపోవచ్చు కానీ మీ ప్రేమ అనంతం. వెల కట్టలేనిది. మీ ప్రేమను నా గుండెల్లో పెట్టుకుంటా.. మీకు ఎం చేయాలో మర్చిపోనని ఆయన వెల్లడించారు.
అంతేకాకుండా.. ‘ఇందిరా పార్క్ ప్రతి టెంటును పలకరించిన వడిని నేను. పంచాయితీ సెక్రటరీలు, గ్రామ పంచాయితీ సిబ్బంది,VRA, VRO, జీఓ నంబర్ 46 వల్ల ఇబ్బంది పడుతున్న కానిస్టేబుల్స్ ఒకటే రాష్ట్రంలో ఒకే కులంలో పుట్టిన వారికి ఉద్యోగాలు ఇవ్వడంలో వ్యత్యాసం ఉంది. ఈ ప్రభుత్వానికి నిరుద్యోగులు చేసే ఆర్తనాదాలు వినే సమయం లేదు. ప్రగతి ముట్టడి చేస్తే కొడుతున్నారు. మమ్ముల్ని కొట్టండి కానీ మా పొట్టమీద కొట్టవద్దు అని విద్యార్థులు కోరుతున్నారు. నోటిఫికేషన్లు ఇచ్చిన ఉద్యోగాల భర్తీ అవ్వక యువతకు పిల్లలు ఇచ్చే దిక్కులేదు.. పెళ్లిళ్లు కావడం లేదు. అమ్మ అయ్యకు బువ్వ పెట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు.
దుఖం ఉన్న వాడికి, ఆకలి ఉన్నవాడికి, అణచివేతకు గురైనవాడికి కావాల్సింది అధికారం. అధికారం కావాల్సింది ఈ వర్గాలకు. అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. మనిషి ఎంత పెద్ద వాడు కానీ చిన్నవాడు కానీ ఒకే ఓటు హక్కు ఇచ్చారు. ఈ దేశంలో సృష్టించబడ్డ సంపద అందరికీ సమానంగా అందాలి అని అంబేద్కర్ చెప్పారు.. 75 సంవత్సరాలు అయిన అందరూ సమానంగా బ్రతికే వ్యవస్థ రాలేదు. సమాజం అంతరాల మధ్య కొట్టుమిట్టాడుతుంది.
నేను చిన్నప్పుడు సలీంనగర్, యకుత్ పుర, తాడిచట్ల దగ్గర ఉన్న sc హాస్టల్ లో ఉన్న. పురుగుల అన్నం, నీళ్ళ చారు పెడితే సచివాలయం వద్ద ప్లేట్లు పట్టుకొని ధర్నా చేశాం. ఆ కష్టాల ఫలితమే సన్నబియ్యం పథకం.
నేను అనుభవించిన దుఃఖాన్ని నేటి తెలంగాణ సమాజంకి రాకూడదు అని కోరుకుంటున్నాను. ఓడిపోతే పోరాడి ఒడిపోతా తప్ప పోరాటం ఆపను. తెలంగాణలో అధికారం ఒకే కుటుంబం చేతిలో ఉంది. ఇంకా 50 ఏళ్ళు ఉన్నా ముఖ్యమంత్రి పదవి ఆ కుటుంబం దాటి బయటకు రాదు. మహారాష్ట్ర ఇంఛార్జి కూడా వారి కుటుంబం వారికే ఇచ్చుకున్నారు. వారి పార్టీలో ఆ కుటుంబాన్ని తప్ప ఇంకొకరిని నమ్మరు. మరి మనల్ని నమ్మని వారికి మనం నమ్మి ఎలా ఓటు వేద్దామా? ఆలోచన చేయండి అని కోరుతున్న. మన శక్తి మీద, మన కులాల మీద నమ్మకం లేదు వారికి.. అలాంటి వారిని మనం ఎందుకు నమ్మాలి. ప్రధాని నరేంద్ర మోడీ ఛాయ్ అమ్మి వచ్చారు. అందుకే పేదవాడికి అండగా ఉంటున్నారు.
మనం బీసీలం.. బాక్ వర్డ్ కాదు. అన్నిట్లో సత్తా చాటగలం. ఆత్మన్యూనతా భావంతో బ్రతకవద్దు. ఆత్మగౌరవంతో బ్రతుకుదాం. ఐక్యతతో ముందుకు పోదాం. అధికారం, హక్కులు అడుక్కంటే రావు, కొట్లడితే వస్తాయి.
భగత్ సింగ్ ఒక మాట చెప్పారు అడుక్కుంటే కాయో, పండో వస్తుంది కానీ కొట్లదితే వచ్చేది స్వాతంత్య్రం అని చెప్పారు. దేశ స్వాతంత్య్రం, సౌభాగ్యం లక్షలాది మంది ప్రాణత్యాగాలు వల్ల వచ్చింది. తెలంగాణ గడ్డమీద స్వేఛ్ఛ కోసం, స్వాతంత్య్రం కోసం, హక్కుల కోసం ఎన్నో వేల మంది ఆత్మార్పణ చేసిన చరిత్ర.. మత్తరించుడు, మాయ చేసుడు తెలంగాణకు రాదు. ఆకలి అయినా భరిస్తుంది కానీ ఆత్మగౌరవాన్ని కొల్పొదు. ఆ స్ఫూర్తిని గుండెల్లో నింపుకొని పనిచేద్దాం.
కులాలు ఏవైనా అణచివేత దుఖం అందరికీ సమానంగా ఉంది. స్వేఛ్ఛ కావాలి, బాగుపడాలి, సమానంగా బ్రతకాలి అందుకోసమే కృషి చేస్తాం. మీ నమ్మకాన్ని వమ్ము చేయను అని హామీ ఇస్తున్నా. ఏనుగు పోతుంటే మోరిగేటివి చాలా ఉంటాయి. ఎవడు వచ్చిన పర్లేదు ఈటల రాజేందర్ మాత్రం రాకూడదు అని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారట. అవుతుందా మీతో.. అరువు తెచ్చుకున్న వాళ్ళు, అమ్ముడు పోయే వాళ్ళు.. ఛానల్, పేపర్ , యుట్యూబ్ వాళ్ళు ఎదో రాస్తున్నారు. సరెండర్ అయితారా ఈటల? ఈటల విలువ ఇచ్చేది ఆత్మగౌరవానికి, డబ్బుకు కాదు. అమ్ముడు పోయిన వారు, గౌరవం లేని వారు నా మీద చిల్లర రాతలు రాస్తున్నారు.. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. వారిని నమ్ముకొని నేను ఇక్కడి వరకు రాలేదు. నేను నమ్ముకుంది ప్రజలను, నేను నమ్ముకుంది ధర్మాన్ని, కష్టాన్ని.
ఇదే వ్యక్తులు నా గురించి గొప్పగా చెప్పిన వారే ఈ రోజు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అలాంటి రాతలకు మీరు టెంప్ట్ కావద్దు. నేను నమ్ముకుంది… ఆత్మగౌరవం, ధర్మం, కష్టం. వచ్చే ఎన్నికల్లో కెసిఆర్ డబ్బులు మద్యం పని చెయ్యవు. ప్రజలు దర్మన్ని కాపాడుతారు. ఓటు అడుక్కునేది కాదు.. కొనుక్కుంటే దొరికే అంగడి సరుకు కాదు. ఓటు నీ హక్కు. నీ బ్రతుకును మార్చే, నీ ఆత్మగౌరవం పెంచే, దోపిడీని కూల్చే AK 47. మీ చేతుల్లో ఉంది పక్కవాడికి ఇచ్చి మళ్ళీ అడుక్కోవద్దు. బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ఈటల రాజేందర్ కి ఆత్మీయ సత్కారం. నాగోలులోని శుభం కన్వెన్షన్ హాల్లో సబ్బండ కులాలు, మోస్ట్ బ్యాక్ వర్డ్ క్లాసెస్, సంచార జాతులు అన్నీ ఒక్క వేదిక మీదకు వచ్చాయి. నేను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అనేక కులాలు సర్టిఫికేట్ పొందడం లేదు, కులాల పేర్లు మారాలి అని వందల దరఖాస్తులు వచ్చాయి. విద్యకు నోచుకోలేనీ అనేక కులాల వాళ్ళం ఉన్నాం.. మా పిల్లలు అయిన చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి మాకు కుల సర్టిఫికేట్ ఇప్పించండి అని నా దగ్గరకు వస్తె … నేనే ఇక మీదట మీ లీడర్ అని చెప్పిన. బీసీలకు సాహసం, శక్తి ఉంటుంది కానీ ఆర్థిక శక్తి ఉండదు. ఈ జనమంతా వచ్చినప్పుడు వారికి అండగా ఉండేది నేనే అని భరోసా ఇచ్చిన.
ఈ రాకెట్ యుగంలో కూడా మనిషి సామాజిక అసమానతలను ఎదుర్కొంటున్నారు. అందుకే వారి సమస్యల పరిష్కారం కోసం 40 రోజుల పాటు అసెంబ్లీలో మీటింగ్ పెట్టీ కొన్ని సమస్యలు పరిష్కారం చేశాం. వరదల్లో చాలా ఊర్లలో ఇళ్లు అన్నీ తడిచిపోయాయి. పంట పొలాలు కోతకు గురయ్యాయి. బ్రతుకులు చిద్రం అయ్యాయి ఆదుకోండి, సర్వే చేయించండి అని అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా నీ కోరితే. సర్వే చేయించేందుకు ఈ రోజు టీమ్ ను పంపించారు.’ అని ఈటల రాజేందర్ అన్నారు.