Etela Rajender : తెలంగాణలో మూడో వంతు జనాభాను జీహెచ్‌ఎంసీ పాలిస్తుందని, రాజకీయాలకు అతీతంగా ప్రజల బాధ్యతను తీసుకోవాలన్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాస మారింది. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. సంకుచితత్వానికి పోకుండా అవసరమైన చోట నిధులు ఇవ్వాలన్నారు. నగరంలోని కనీస సౌకర్యాలకు నోచుకొని ప్రాంతాలపై దృష్టి పెట్టాలన్నారు. బడ్జెట్ ఎంత, ఖర్చులు, రాబడి అనేది పక్కన పెట్టి సమస్యలపై దృష్టి పెట్టకపోతే నగరం మసకబారుతుందని ఆయన అన్నారు.…