Vishwak Sen: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ పెళ్లి పీటలు ఎక్కుతున్నాడా.. ? అంటే నిజమే అని అని అంటున్నారు నెటిజన్స్. ఆలా అనుకోవడానికి కారణం విశ్వక్ పోస్ట్ చేసిన ఒక పోస్ట్. తాజాగా విశ్వక్ ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాడు. ” నా ఫ్యాన్స్ కు, శ్రేయోభిలాషులకు.. ఇన్నేళ్ళుగా మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు, అభిమానానికి నేనెల్లప్పుడు ఋణపడి ఉంటాను. ఇప్పుడు నేను మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని పంచుకోవాలని అనుకుంటున్నాను. నేను నా జీవితంలో కొత్త అధ్యయనాన్ని మొదలుపెట్టాలనుకుంటున్నాను. నేను ఫ్యామిలీని స్టార్ట్ చేస్తున్నాను.. త్వరలోనే ఇందుకు సంబంధించిన డీటెయిల్స్ ను చెప్తాను.. థాంక్యూ.. మీ విశ్వక్ సేన్” అంటూ రాసుకొచ్చాడు. అంతేకాకుండా ఆ డీటెయిల్స్ ఆగస్టు 15 న చెప్తాను అని కూడా తెలిపాడు. విశ్వక్ ఫ్యామిలీ అని హ్యశ ట్యాగ్ ను జతచేయడంతో ఇది ఖచ్చితంగా విశ్వక్ పెళ్లి వార్తనే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.
Rajinikanth: జైలర్ హిట్ అవుతుందని నేను అనుకోలేదు.. రజినీ సంచలన వ్యాఖ్యలు
ఇంకొందరు మాత్రం ఏదైనా కొత్త సినిమా ప్రమోషన్స్ అయ్యి ఉంటాయి అని చెప్పుకొస్తున్నారు. ఇక విశ్వక్ సన్నిహితుల సమాచారం ప్రకారం ఖచ్చితంగా విశ్వక్ పెళ్లి వార్తనే అని .. త్వరలోనే విశ్వక్ పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుపుతున్నారు. ఇక ఈ పోస్ట్ పై అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది శుభాకాంక్షలు తెలుపుతుండగా.. ఇంకొంతమంది మళ్లీ ప్రాంక్ చేయకు బ్రో అంటున్నారు. ఇక విశ్వక్ కెరీర్ గురించి చెప్పాలంటే.. ప్రస్తుతం అతని చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఒకటి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కాగా.. మరో రెండు లైనప్ లో ఉన్నాయి. మరి ఈ పోస్ట్ విశ్వక్ పెళ్లి వార్తనా.. ? లేక కొత్త సినిమానా ..? అనేది తెలియాలంటే కొద్దీ రోజులు ఆగక తప్పదు.