NTV Telugu Site icon

Etela Rajender : బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ లు ఒకే తాను ముక్కలు

Etela

Etela

Etela Rajender : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజ్యసభ సభ్యుడు ఈటల రాజేందర్ బీఆర్‌ఎస్ (భారత రాష్ట్ర సమితి) , కాంగ్రెస్ పార్టీపై విమర్శల దాడి చేశారు. ఈ రెండు పార్టీలూ ఒకే తాను ముక్కలు అని, ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో అనేక సమావేశాలు నిర్వహించడం వెనుక వైఫల్యాలను దాచిపెట్టే ఉద్దేశమే ఉందని ఈటల అన్నారు. హైదరాబాద్‌లో ఒకటి కాదు, ఏకంగా 50 మీటింగ్‌లు పెట్టినా, రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోలేరని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అభివృద్ధికి కంటే రాజకీయ ప్రచారానికే కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు.

తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. దీనిపై కొందరు కావాలనే అపోహలు సృష్టిస్తున్నారని, ప్రజలు అవగాహనతో ఉండాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలనలో రాష్ట్రాల ఆదాయంలో నష్టం జరుగుతోందన్న ఆరోపణలను ఈటల ఖండించారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాలకు పన్నుల్లో వాటా పెరిగిందని, మౌలిక సదుపాయాల కోసం మరింత నిధులు అందుతున్నాయని పేర్కొన్నారు.

ఉత్తర ప్రదేశ్ వంటి పేద రాష్ట్రాలకు కేంద్రం అధిక నిధులు కేటాయిస్తోందన్న ఆరోపణలపై ఈటల స్పందిస్తూ, అభివృద్ధి లోపించిన ప్రాంతాలకు ఎక్కువ సహాయం అందించడం తప్పేమీ కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ తప్పుడు ప్రచారంతో ప్రజలను మోసగించేందుకు చూస్తోందని విమర్శించారు. రాష్ట్రానికి నిధులు తగ్గించారన్న ఆరోపణలు నిరాధారమని, రైల్వే, రోడ్లు, ఇతర మౌలిక వసతుల కలయిక వల్ల రాష్ట్రాలకు మరింత అభివృద్ధి జరుగుతోందని ఈటల వివరించారు.

భారతదేశం గట్టి రక్షణ వ్యవస్థను కలిగి ఉందని, పాకిస్తాన్‌లోని పరిస్థితులను చూస్తే మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న ముందుజాగ్రత్తలు అర్థమవుతాయని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అవినీతి తారాస్థాయికి చేరిందని ఈటల విమర్శించారు. కర్ణాటకలో ప్రస్తుతం 40% కమిషన్ ప్రభుత్వం నడుస్తోందని, ఇది ప్రజలకు తెలిసిందేనని తెలిపారు.

మూసీ నది ప్రక్షాళన గురించి తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దని ఈటల స్పష్టం చేశారు. మూసీ నది శుభ్రంగా ఉంచడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి మాత్రమే మాట్లాడానని, రేవంత్ రెడ్డి పేర్కొన్న సుందరీకరణ గురించి కాదని స్పష్టం చేశారు.

Betting Apps : బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లకు చుక్కలే.. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు