తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రోజు రోజుకు పార్టీల్లో చేరికలు జోరు పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ బీజేపీ గూటికి మాజీమంత్రులు కృష్ణ యాదవ్, చిత్తరంజన్ చేరారు. ఈ రోజు రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో వీరి చేరిక కార్యక్రమం జరిగింది. చిత్తరంజన్ దాస్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరో కీలక నేత కృష్ణ యాదవ్ కు ఈటల రాజేందర్ బీజేపీ కుండువా కప్పారు. సిర్పూర్ కాగజ్ నగర్ జడ్పీటీసీ రేఖ సత్యనారాయణ కూడా ఈ రోజు పార్టీలో చేరగా.. డీకే అరుణ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. బీజేపీ చేరిన నాయకులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
Also Read : Rk Roja: సీఎం జగన్ ను విమర్శిస్తే.. మర్యాద దక్కదు బ్రాహ్మణి..?
ఎన్టీఆర్ మీద సంచలనం సృష్టించి గెలిచిన బీజేపీ చేరిన సందర్భంగా చిత్తరంజన్ దాస్ కి శుభాకాంక్షలు తెలిపారు. పని గట్టుకొని కొంత మంది విష ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సొంత ఎజెండాతో పత్రికలు రాతలు రాయడం సరికాదని ఆయన హితవు పలికారు. బీఅర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ఖమ్మం లో సీనియర్ నాయకులు బీజేపీ లో చేరేందుకు సిద్దంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. ఖమ్మం బహిరంగ సభలో 11మంది నాయకులు జాయిన్ అయ్యారని, ఇంకా పెద్ద మొత్తంలో పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నట్టు ఈటల వ్యాఖ్యానించారు. వీరంతా ఈరోజు కిషన్ రెడ్డి ని కలుస్తారని ఆయన పేర్కొన్నారు.
Also Read : Rakshasa Kavyam: అరడజను సినిమాలు.. వెనక్కి తగ్గి అక్టోబర్ 13న “రాక్షస కావ్యం”