Etela Rajender: ఫీర్జాదిగూడ మున్సిపాలిటీలో కూల్చివేతలపై మండిపడిన ఈటల..
- ఫీర్జాదిగూడ మున్సిపాలిటీలోని పర్వతపురంలో కూల్చివేతలు అక్రమం
- దీనిని తీవ్రంగా ఖండిస్తున్నా
- కూల్చివేతలపై మండిపడిన ఈటల రాజేందర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Etela Rajender: ఫీర్జాదిగూడ మున్సిపాలిటీలో కూల్చివేతలపై మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఫీర్జాదిగూడ మున్సిపాలిటీలోని పర్వతపురంలో కూల్చివేతలు అక్రమమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అనుమతులు ఇచ్చిన అధికారులపై కేసులు పెట్టాలని.. కూల్చిన ఇళ్లకు పరిహారం, బాధితులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని ఈటల పేర్కొన్నారు. ఈ భూముల విషయంలో దమ్ముంటే ప్రభుత్వం విచారణ జరపాలని ఎంపీ సవాల్ విసిరారు. పేద మధ్య తరగతి వారు రూపాయి రూపాయి పోగు చేసి కొనుక్కున్నారని.. అన్ని అనుమతులు తీస్కొని ఇల్లు కట్టుకుంటే ఇవాళ కూలగొట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Beerla Ilaiah: మంత్రి పదవి ఆశిస్తున్నా.. సీఎం సానుకూలంగా స్పందించారు..
Also Read
- AP Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్!
- Sugar Stock Limits: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు..
- Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
- Chief Selector: ఆ మాజీ ప్లేయర్కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పేదల ఇళ్లు కుల్చివేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆనాడు అనుమతులు అధికారులే ఇచ్చారు.. ఈనాడు వచ్చి కూలగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం అయినా, రేవంత్ ప్రభుత్వం అయినా పేదలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. గంజాయి అమ్మేవాళ్ళను ఆపే తెలివి లేదు కానీ వందల మంది పోలీసులను వేసుకొని పేదల ఇళ్లు కూలగొట్టడానికి వెళ్లారంటూ ఎద్దేవా చేశారు. గతంలో ఇలాంటి చర్యలకు పాల్పడితేనే కేసీఆర్ ఓడిపోయారన్నారు. ఒళ్లు వంచి కష్టపడి కాంగ్రెస్ అధికారంలోకి రాలేదని.. కేసీఆర్ మీద వ్యతిరేకతతో కాంగ్రెస్ గెలిచిందన్నారు. రెవెన్యూ మంత్రికి తెలియకుండానే రెవెన్యూ అధికారులు పేదల ఇళ్లు కూల్చారంటూ ఆగ్రహించారు. పేదల మీద దండయాత్ర చేయడమే న్యాయమా అంటూ ప్రశ్నించారు. అందినకాడికి దండుకోవాలని కాంగ్రెస్ నేతలు చూస్తున్నారన్నారు. చట్టం మరచి, బాధ్యత మరచి బానిసలుగా పని చేస్తే జైలుపాలు అయిన అధికారులు ఉన్నారన్నారు. అధికారులు సత్యం ప్రకారం పని చేయాలని.. రెవెన్యూ అధికారులకు హెచ్చరిస్తున్నామని.. చట్టానికి అనుగుణంగా పని చేయాలని.. పేదల మీద దౌర్జన్యం చేయొద్దని ఈటల రాజేందర్ సూచించారు.
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్!
-
Sugar Stock Limits: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు..
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
-
Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
-
Chief Selector: ఆ మాజీ ప్లేయర్కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..