Errabelli Dayakar Rao : రేవంత్ రెడ్డి నీ జీవిత చరిత్ర మొత్తం నాకు తెలుసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాలకుర్తి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ని జీవిత చరిత్ర మొత్తం నాకు తెలుసు అని అన్నారు. గోడల మీద రాతలు రాసే వ్యక్తివి నీవు అని, నా తాత ముత్తాతల నుండి వేల ఎకరాలు నా ఆస్తి అని మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ఒక జోకర్, చంద్రబాబుతోనే స్వయంగా నేను చెప్పాను రేవంత్ రెడ్డి బ్రోకర్ అని అన్నారు.
అంతేకాకుండా.. ‘ఓటమి ఎరుగని నాయకున్ని నేను. గత ఎన్నికల్లో కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు. అమెరికా తానా సభలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు మూడు గంటల కరెంటు ఇస్తా అన్న వ్యక్తివి నీవు. తెలంగాణ ప్రజలు నీ బ్రోకర్ మాటలు నమ్మరు. మీ కాంగ్రెస్ పార్టీ నాయకులే 10 కోట్లు తీసుకొని టికెట్ ఇచ్చారని అంటున్నారు. దందాలు చేసుడు ,బ్రోకరిజం బంజేయమని నీకు ఎప్పుడూ చెప్పే వ్యక్తిని నేను. నీ బతుకు హెలికాప్టర్ ఎక్కే రేంజ్ ఉందా. కరోనా టైంలో 2000 మంది పేషంట్లను బతికించా.
Also Read
- AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
- Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
నా గురించి మాట్లాడాలి అంటే నీకు సిగ్గుండాలి. ఎమ్మెల్యేగా ,ఎంపీగా మంచి పేరు సంపాదించిన. చంద్రబాబుతో కలిసి నేను ధర్నా చేస్తుంటే పోలీసులు లాఠీ చార్జి చేస్తుంటే తప్పించుకోని పోయిన వ్యక్తివి నీవు. పాలకుర్తి ప్రజలను తన్నిన వ్యక్తివి నీవు , కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎలా ఓట్లేస్తారు. రేవంత్ రెడ్డి పాలకుర్తి ప్రజలను తనితే , మనం ఓట్ల ద్వారా కాంగ్రెస్ పార్టీని తన్నాలి. చాకలి ఐలమ్మ , దొడ్డి కొమురయ్య లాగా పాలకుర్తి ప్రజలు రేవంత్ రెడ్డి మీద తిరగబడాలి’ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
-
CM Revanth Reddy : ఎల్ నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
-
AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
-
Kawasaki Z300 India Launch: Kawasaki Z300 భారత్లోకి.. ధర ఎంత? 296cc ఇంజిన్, ఫీచర్లు, లాంచ్ డేట్ వివరాలు!
-
Nithiin: ‘అలియాస్ రుక్మిణి’తోనైనా నితిన్ లెక్క సరిచేస్తాడా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!