Australia retains Ashes 2023 vs England after 4th Test Drawn: ‘బజ్‌బాల్’ ఆటతో సొంతగడ్డపై యాషెస్ 2023ని గెలుచుకుందాం అనుకున్న ఇంగ్లండ్ ఆశలు ఆవిరయ్యాయి. నాలుగో టెస్టులో గెలిచి యాషెస్ సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలనుకున్న ఇంగ్లండ్‌కు వరణుడు అడ్డుపడ్డాడు. ఎడతెరిపిలేని వర్షం కారణంగా.. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్, ఆ్రస్టేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు ఐదో రోజు ఆట సాధ్యపడలేదు. దాంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగియగా.. ఇంగ్లండ్‌కు తీవ్ర నిరాశ మిగిలింది. బజ్‌బాల్ ఆట ఇంగ్లీష్ జట్టును దెబ్బకొట్టిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఆస్ట్రేలియా చేతిలో తొలి రెండు టెస్టులు ఓడినా.. మూడో మ్యాచ్‌లో పుంజుకుని సిరీస్ ఆశలు నిలబెట్టుకున్న ఇంగ్లండ్‌కు నాలుగో టెస్టు కీలకంగా మారింది. గెలిచే స్థితిలో ఉన్న ఇంగ్లండ్ జోరును చివరి రోజు వరుణుడు అడ్డుకున్నాడు. నాలుగో రోజు ఆట చివరికి రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 214/5తో నిలిచింది. చివరి రోజు ఆస్ట్రేలియాను త్వరగా ఆలౌట్ చేసి.. విజయంపై ఇంగ్లండ్ కన్నేసింది. కానీ ఆ అవకాశమే ఇవ్వకుండా.. వరుణుడు ఇంగ్లండ్‌ను ఆడేసుకున్నాడు.
Also Read: WI vs IND: హైదరాబాద్ పేసర్ జోరు.. రెండో టెస్టులో విజయం దిశగా భారత్!
నాలుగో రోజులో కూడా వర్షం కారణంగా 30 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం అయింది. ఇది కూడా ఇంగ్లీష్ జట్టు విజయావకాశాలపై ప్రభావం చూపించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 317 రన్స్ చేయగా.. ఇంగ్లండ్ 592 పరుగులు చేసింది. ప్రస్తుతం ఐదు టెస్టుల సిరీస్‌లో ఆ్రస్టేలియా 2–1తో ఆధిక్యంలో ఉంది. చివరి టెస్టులో ఇంగ్లండ్ నెగ్గినా.. సిరీస్ 2–2తో సమంగా ముగుస్తుంది. అయితే చివరిసారి యాషెస్ సిరీస్‌లో ఆ్రస్టేలియా గెలుపొందడంతో.. ఈసారీ ఆ జట్టు వద్దే యాషెస్ ట్రోఫీ ఉంటుంది. చివరి టెస్టు ఈ నెల 27న ఓవల్‌లో ఆరంభం కానుంది.
Also Read: Gold Price Today: పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్.. తెలుగు రాష్ట్రాల్లో తులం రేటు ఎంత ఉందంటే?
In 2017 – Australia won the Ashes.
In 2019 – Australia retained the Ashes.
In 2021 – Australia won the Ashes.
In 2023 – Australia retained the Ashes.The dominance of Australia in Ashes. pic.twitter.com/NxmfLIiVoT
— Johns. (@CricCrazyJohns) July 23, 2023