తెలంగాణ ఇంజనీరింగ్ మొదటి విడత సీట్లు కేటాయించారు. కన్వీనర్ కోటాలో 78, 694 సీట్లు ఉండగా 75, 200 సీట్లు కేటాయించారు. అంటే 95.6 శాతం సీట్లు కేటాయించారు. 89 కాలేజీలో వంద శాతం సీట్లు కేటాయించారు. ఇందులో 7 యూనివర్సిటీ కాలేజీలు, 82 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సుల్లో53, 890 సీట్లు ఉంటే 53, 517 సీట్లు కేటాయించారు.