ENG vs IND Playing XI: నేడే చివరి టీ20.. వైట్‌వాష్‌ను భారత్ తప్పించుకుంటుందా.?
- నేడు (జూలై 11) సౌతాంప్టన్‌లో భారత్-ఇంగ్లండ్ మధ్య చివరి టీ20 మ్యాచ్.
- ఇప్పటికే 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకున్న ఇంగ్లండ్.
- వైట్‌వాష్‌ను తప్పించుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్న టీమిండియా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ENG vs IND Playing XI: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకున్న ఇంగ్లండ్.. చివరి మ్యాచ్ లోనూ గెలిచి భారత్‌ను వైట్‌వాష్ చేయాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు వరుస పరాజయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా.. కనీసం చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో రంగంలోకి దిగుతోంది. ఈ మ్యాచ్ నేడు (జూలై 11) సౌతాంప్టన్ లోని ఏజియాస్ బౌల్ (ది రోజ్ బౌల్) వేదికగా జరగనుంది.
టీ20 జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్రేయాస్ అయ్యర్‌కు ఇప్పటివరకు ఒక్క విజయం కూడా నమోదు చేయలేదు . ఐర్లాండ్‌తో సిరీస్‌ను 0-2తో కోల్పోయిన భారత్.. ఇప్పుడు ఇంగ్లండ్ పర్యటనలోనూ నిరాశపరిచింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ స్థిరత్వం లేకపోవడంతో వరుసగా 3 మ్యాచ్‌లు ఓడిపోయింది. దీంతో చివరి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను గౌరవప్రదంగా ముగించాలని భారత జట్టు భావిస్తోంది.
Also Read
ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ అన్ని విభాగాల్లో భారత్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. నాలుగో టీ20లో ఏకంగా 9 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు చివరి మ్యాచ్‌లోనూ గెలిచి 4-0తో సిరీస్‌ను ముగించాలని ఇంగ్లాండ్ భావిస్తోంది. భారత బ్యాటర్లలో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మాత్రమే నిలకడగా రాణిస్తున్నాడు. నాలుగో టీ20లో 49 బంతుల్లో అజేయంగా 80 పరుగులు చేసినప్పటికీ.. మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. ఈ సిరీస్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా అయ్యర్ ఉన్నారు. భారత బౌలింగ్ విభాగం తీవ్రంగా నిరాశపరిచింది. అర్ష్‌దీప్ సింగ్ 4 వికెట్లు తీసి జట్టులో టాప్ వికెట్ టేకర్‌గా ఉన్నప్పటికీ.. అందులో మూడు వికెట్లు ఒకే మ్యాచ్‌లో వచ్చాయి. హర్షిత్ రాణా 3 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
మరోవైపు ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ కూడా అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. గత మ్యాచ్‌లో అజేయంగా 79 పరుగులు చేసి జట్టుకు సునాయాస విజయాన్ని అందించాడు. మరోవైపు జోఫ్రా ఆర్చర్ తన వేగంతో భారత టాప్ ఆర్డర్‌ను వరుసగా కుదేలు చేస్తున్నాడు. ఇప్పటివరకు ఈ సిరీస్‌లో 6 వికెట్లు పడగొట్టిన ఆర్చర్.. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీని రెండు మ్యాచ్‌ల్లో రెండుసార్లు ఔట్ చేశాడు. ఆర్చర్ భారత టాప్ ఆర్డర్‌ను ఇబ్బంది పెట్టినప్పటికీ.. అభిషేక్ శర్మ మాత్రం అతనిపై పూర్తి ఆధిపత్యం చూపిస్తున్నాడు. ఇప్పటివరకు జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో అభిషేక్ ఒక్కసారి కూడా ఔట్ కాలేదు. ఇంకా ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఈ సిరీస్‌లో 129 పరుగులతో మంచి ఫామ్‌లో ఉన్నాడు. అయితే గతంలో అర్ష్‌దీప్ సింగ్ అతడిని మూడుసార్లు ఔట్ చేశాడు. చివరి మ్యాచ్‌లోనూ సాల్ట్‌ను త్వరగా పెవిలియన్‌కు పంపగలిగితే భారత్‌కు విజయం సాధించే అవకాశాలు పెరుగుతాయి.
టీ20ల్లో భారత్, ఇంగ్లండ్ ఇప్పటివరకు 34 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 18 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, ఇంగ్లండ్ 15 మ్యాచ్‌లు గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. మొత్తం రికార్డులో భారత్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. ప్రస్తుత సిరీస్‌లో మాత్రం ఇంగ్లండ్ పూర్తిగా పైచేయి సాధించింది. సౌతాంప్టన్‌లోని ఏజియాస్ బౌల్ పిచ్ బ్యాటర్లు, బౌలర్లకు సమానంగా అనుకూలంగా ఉంటుంది. కొత్త బంతితో పేసర్లకు స్వింగ్, సీమ్ మూవ్మెంట్ లభించే అవకాశం ఉంది. అయితే సెటిల్ అయిన తర్వాత బ్యాటర్లు స్వేచ్ఛగా షాట్లు ఆడేందుకు ఈ పిచ్ అనుకూలంగా మారుతుంది. మంచి స్కోరు నమోదయ్యే అవకాశముంది. సౌతాంప్టన్‌లో నేడు వర్షం పడే అవకాశాలు లేవు. మ్యాచ్ సాయంత్రం 7:00 గంటలకు (భారత కాలమానం) ప్రారంభం కానుంది.
భారత్ ప్లేయింగ్ XI:
అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (W), శ్రేయాస్ అయ్యర్ (C), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, సంజూ శాంసన్, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, సూర్యాంశ్ షెడ్గే.
ఇంగ్లండ్ ప్లేయింగ్ XI:
ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (W), హ్యారీ బ్రూక్ (C), జాకబ్ బెతెల్, టామ్ బాంటన్, సామ్ కరన్, విల్ జాక్స్, జోఫ్రా ఆర్చర్, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్, సోనీ బేకర్, రెహాన్ అహ్మద్, జోర్డాన్ కాక్స్, సాకిబ్ మహ్మూద్, ల్యూక్ వుడ్.
తాజావార్తలు
-
ENG vs IND Playing XI: నేడే చివరి టీ20.. వైట్‌వాష్‌ను భారత్ తప్పించుకుంటుందా.?
-
Bahamas Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. 10 మంది దుర్మరణం.. స్వాతంత్ర్య వేడుకల వేళ విషాదం
-
Leopard: అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత కలకలం.. పరుగులు తీసిన భక్తులు
-
Dhanush: ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా తర్వాత మరో సంచలనం!.. అదే దేవుడిపై ధనుష్ కొత్త ప్రాజెక్ట్
-
Tragedy: వీడు మనిషి కాదు మానవ మృగం.. పోక్సో కేసు పెట్టారన్న కక్షతో.. భార్య, ఇద్దరు పిల్లలతో పాటు మరో ముగ్గురి హత్య..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!