ప్రముఖ టెక్ దిగ్గజం, వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ ఏం చేసినా చాలా డిఫరెంట్ గా చేస్తూ ఉంటారు. అందుకే ఆయనకు లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ ఉంటారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. అందులో మస్క్ యాక్షన్ హీరోలా మారిపోయినట్లు కనిపిస్తున్నారు. ఆ వీడియోలో అసాల్ట్ రైఫిల్‌తో షూటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. 50 క్యాలిబర్ బ్యారెట్ రైఫిల్‌తో హిప్ ఫైరింగ్ చేస్తున్నా’ అంటూ ఓ క్యాప్షన్ జోడించి మస్క్ ఈ వీడియోను స్వయంగా పోస్ట్ చేశారు.
Also Read: Punjab : డ్రోన్ కు హెరాయిన్ నింపిన కోక్ బాటిల్ స్వాధీనం చేసుకున్న సైనికులు..
ఈ వీడియో చూసిన నెటిజన్లు లక్షల సంఖ్యలో లైక్ చేస్తున్నారు. వేల మంది కామెంట్లు చేస్తున్నారు. నిజంగా సినిమాలో హీరోలా ఉన్నారంటూ చాలా మంది మస్క్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక కొంతమంది అయితే హాలివుడ్ హీరోలను మించిపోయి ఉన్నారని సినిమాలు తీయ్యండి అంటూ సలహా ఇచ్చేస్తున్నారు. ఇక మస్క్ ఇప్పుడే కాదు గతంలో కూడా తుపాకులకు సంబంధించిన ఫోటోలను నెట్టింట షేర్ చేసుకున్నారు. నిత్యం తన బెడ్ పక్కన తుపాకులు ఉంటాయి అంటూ గత నవంబర్ లో ఆయన రెండు పిస్టళ్లు ఉన్న ఓ ఫోటోను షేర్ చేశారు.
ఇక అసాల్ట్ రైఫిల్ వినియోగంపై కూడా గతంలో టెక్సాస్ లో ఎలిమెంటరీ స్కూల్లో కాల్పులు జరిగినప్పుడు మస్క్ స్పందించారు. వాటి వినియోగం పై ఆంక్షలు విధించాలని కొనుగోలుదారుకు గురించి అన్ని తెలుసుకొని నేరచరిత్ర లేదని నిర్ధారించుకున్నాకే వారికి పర్మిషన్ ఇవ్వాలని మస్క్ గతంలో కోరాడు. ఇక ఈ రోజు ఉదయమే మస్క్ వీడియో షేర్ చేయగా అది కొద్ది సేపట్లోనే వైరల్ గా మారిపోయింది. దీన్ని బట్టే ఎలాన్ మస్క్ క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. దీన్ని కోట్ల మంది వీక్షించగా, లక్షల మంది లైక్ చేశారు.
Hip-firing my Barrett 50 cal pic.twitter.com/OkNnjWid0r
— Elon Musk (@elonmusk) September 30, 2023