Elon Musk: అమెరికా రాజకీయాలపై ట్వీట్ చేసిన మస్క్.. ఏమన్నారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elon Musk: మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లకు ఓటు వేయాలని ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ ప్రజలను కోరారు. ఆయన రిపబ్లికన్ కాంగ్రెస్‌ను ఎందుకు కోరుకుంటున్నారో వివరిస్తూ.. రెండు రాజకీయ పార్టీలు అధికారంలో ఉండటం ఉత్తమమని, డెమోక్రాట్లు ఇప్పటికే అధ్యక్ష పదవి కలిగి ఉన్నారని.. కావున మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లకు ఓటేయాలని ట్విట్టర్ యూజర్లకు సూచించారు. భాగస్వామ్య అధికారం రెండు పార్టీల చెత్త మితిమీరిన చర్యలను అరికడుతుందన్నారు. రెండు పార్టీలకు అవకాశం కల్పించడం వల్ల అభివృద్ధి వేగం పుంజుకుంటుందన్నారు. అందువల్ల మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ కాంగ్రెస్ ఓటేయాలని సూచిస్తున్నట్లు ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు.
టెస్లా యజమాని ఎలన్ మస్క్ అమెరికా రాజకీయాలపై ట్వీట్ చేయడం ఇదే మొదటిసారి. ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్‌ను కొనుగోలు చేసి, భారీ మార్పులు తీసుకొస్తూ ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తున్న ప్రపంచ కుబేర వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ తాజాగా రాజకీయాలపై దృష్టి సారించారు. మొట్టమొదటి సారిగా రాజకీయాలకు సంబంధించిన ట్వీట్ చేశారు. అందులో అమెరికాలో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లకు మద్దతు ఇవ్వాలని ఆయన సోమవారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా అమెరికన్లను కోరారు. ఆయన ట్వీట్‌పై సోషల్ మీడియాలో యూజర్లు స్పందిస్తున్నారు.
Also Read
- Tobacco Farmers: పొగాకు రైతులకు సర్కార్ గుడ్‌న్యూస్.. క్వింటాల్‌కు రూ.1,000 ప్రోత్సాహకం, వడ్డీలేని రుణాలు
- AP PPP Policy 2026కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు జారీ
- Minister TG Bharath: మంత్రులపై నిఘా పెట్టేవారు.. నేరస్థులపై ఎందుకు పెట్టరు?: టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
BJP MP Janardhan Mishra: మద్యం సేవించండి, గుట్కా తినండి.. నీటి సంరక్షణపై బీజేపీ ఎంపీ చిట్కాలు
అందులో ఆయన కఠినమైన డెమోక్రాట్లు లేదా రిపబ్లికన్లు ఎప్పుడూ ఇతర వైపునకు ఓటు వేయరని అన్నారు. కాబట్టి స్వతంత్ర ఓటర్లు నిజంగా ఎవరు బాధ్యత వహించాలో నిర్ణయిస్తారని ఎలన్ మస్క్ అన్నారు. మధ్యంతర ఎన్నికలకు ముందు డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఈరోజు చివరిసారిగా ప్రచారం నిర్వహించారు. బైడెన్ అధ్యక్ష పదవిని ప్రభావితం చేసే ఈ ఎన్నికలు ఉక్రెయిన్‌కు పాశ్చాత్య మద్దతును అణగదొక్కే అవకాశం కనిపిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ తిరిగి వచ్చే ప్రయత్నానికి కూడా మార్గం తెరవొచ్చు. ప్రారంభ ఓటింగ్ ఎంపికల ద్వారా 40 మిలియన్లకు పైగా బ్యాలెట్లు వేశారు. అంటే ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికాను పాలించేది ఎవరన్నది ఇప్పటికే నిర్ణయించబడింది. దేశవ్యాప్తంగా మంగళవారం ప్రారంభమయ్యే పోలింగ్‌కు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి.
కరోనా వ్యాప్తి, ఉక్రెయిన్‌పై రష్యా దాడి తరువాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్న కీలక సమయంలో అమెరికా మధ్యంతర ఎన్నికలు జరుగుతున్నాయి. అమెరికాలో రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగంలో పెరుగుదల వంటి సమస్యలు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో అధ్యక్షుడు జో బైడెన్ ప్రజాదరణ క్రమంగా క్షీణిస్తోంది. అధికారులతో తన గొడవల మధ్య, డొనాల్డ్ ట్రంప్ కూడా రాజకీయాల్లోకి తిరిగి రావడానికి కూడా ప్రయత్నిస్తున్నారు.
తాజావార్తలు
-
TPCC Chief Mahesh Kumar Goud: పుట్టుకతో చక్రవర్తులు అవుతారు.. కానీ పాపన్న పోరాడి రాజయ్యాడు..
-
Tobacco Farmers: పొగాకు రైతులకు సర్కార్ గుడ్‌న్యూస్.. క్వింటాల్‌కు రూ.1,000 ప్రోత్సాహకం, వడ్డీలేని రుణాలు
-
KTM RC 160 Price Hiked: KTM RC 160 ధర పెంపు.. ఇప్పుడు ఎంతంటే? కొత్త ధర, ఇంజిన్, ఫీచర్ల పూర్తి వివరాలు
-
Lopamudra Raut Theft Case: బిగ్‌బాస్ ఫేమ్ ఇంట్లో భారీ చోరీ.. నిందితుడి అరెస్ట్, రూ.76 లక్షల సొత్తు స్వాధీనం!
-
Tollywood : ఇండస్ట్రీ సంక్షోభానికి కారణం స్టార్ హీరోలేనా? సింగిల్ స్క్రీన్లు మూతపడటానికి బాధ్యులెవరు?
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!