నరాల బలహీనత తగ్గించడానికి ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. కొన్ని ఆహారాలు నరాల వ్యవస్థను బలోపేతం చేస్తాయి.. శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. శరీరానికి సరైన పోషకాలు అందకపోతే.. అనేక రకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. ఈ రోజుల్లో చాలామంది ఎక్కువగా నరాల బలహీనత సమస్యతో బాధపడుతున్నారు. కొంత దూరం నడిచినా కానీ కాళ్ళు లాగడం.. చిన్న చిన్న బరువులు కూడా ఎత్తలేకపోవడం.. త్వరగా అలసటకు గురికావడం.. కండరాల నొప్పులు వంటి సమస్యలు వేధిస్తూ ఉన్నాయి. మరి వీటి అన్నిటికి చెక్ పెట్టాలంటే బలమైన ఆహరం తీసుకోవాల్సిందే.
Also Read:Devi Sri Prasad: విశాఖలో దేవి శ్రీ మ్యూజికల్ నైట్ ప్రోగ్రాంపై ఉత్కంఠ.. అసలు ఏమవుతోంది?
గుమ్మడి గింజలు:
వీటిలో ఐరన్ , మెగ్నీషియం , కాపర్ లాంటి గుణాలు ఉంటాయి. దీనిని ప్రతి రోజు డైట్ లో యాడ్ చేసుకోవడం వలన నరాల బలహీనత ఇట్టే మాయమవుతుంది.
బ్లుబెర్రీస్ :
వీటిలో యాంథోసైనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. దాని కారణంగా నరాలు దెబ్బ తినకుండా కాపాడుతాయి.. అలాగే నరాలలో బలం చేకూరుతుంది.
Also Read:Food Safety : అమీర్‌పేట్‌లో జ్యూసులు తాగుతున్నారా..? జర జాగ్రత్త.. తరువాత మీ ఇష్టం..!
సిట్రస్ ఫ్రూట్స్ :
వీటిలో కూడా విటమిన్లు , యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా లభిస్తాయి. సీజన్ ను బట్టి ఆయా కాలాలలో వచ్చే సిట్రస్ ఫ్రూట్స్ తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.
ఆకు కూరలు: ఆకు కూరలలో విటమిన్ బి పుష్కలంగా లభిస్తుంది.. అంతే కాకుండా శరీరానికి కావాల్సిన విటమిన్స్ అన్నీ పుష్కలంగా లభిస్తాయి.
Also Read:Shine Tom Chako: డ్రగ్స్ రైడ్ తప్పించుకునేందుకు సాహసం.. 3వ ఫ్లోర్ నుంచి దూకి మరీ పరార్!
ఇక వీటితో పాటు డ్రై ఫ్రూట్స్, గుడ్లు , పాలు లాంటి ఆహారపదార్ధాలను కూడా డైట్ లో యాడ్ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు నరాలకు చాలా మంచివి.. వీటితో నరాలకు బలం చేకూరుతుంది. ఇవి కొవ్వు పదార్ధాలు చేపలలో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని తరచూ తినడం మంచిది.