Ronald Rose: హైదరాబాద్లో కౌంటింగ్ కేంద్రాల పరిశీలన.. కౌంటింగ్కు అంతా సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ జిల్లాలో 15 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. కౌంటింగ్ నేపథ్యంలో.. శనివారం సికింద్రాబాద్ వెస్లీ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం కౌంటింగ్ సెంటర్ ఏర్పాట్లను ముందుగా పరిశీలించారు. అనంతరం అంబర్ పేట్ జీహెచ్ఎంసి ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన మలక్ పేట్ కౌంటింగ్ సెంటర్, ప్రొ.జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సికింద్రాబాద్ కౌంటింగ్ సెంటర్, దోమలగూడ ఏ.వి కాలేజ్ లో ఏర్పాటు చేసిన ముషీరాబాద్ కౌంటింగ్ సెంటర్, నారాయణగూడ రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి ఉమెన్స్ కాలేజ్ (జి.ఎఫ్ అండ్ ఓపెన్ గ్రౌండ్) ఏర్పాటు చేసిన అంబర్ పేట్ కౌంటింగ్ సెంటర్లను జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ పరిశీలించారు. అనంతరం.. ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ లో ఏర్పాటు చేసిన సనత్ నగర్ కౌంటింగ్ సెంటర్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్యాతో కలిసి ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ పరిశీలించారు.
Actress Subbalakshmi: సీనియర్ నటి సుబ్బలక్ష్మి చివరి క్షణాలు.. వీడియో షేర్ చేసిన మనవరాలు
Also Read
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
ఈ సందర్భంగా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ… కౌంటింగ్ సెంటర్ లోకి ఎవ్వరికీ సెల్ ఫోన్లు అనుమతి లేదని తెలిపారు. ఏజెంట్లు, కౌంటింగ్ నియమించిన సిబ్బంది అందరూ ఉదయం 5 గంటల వరకు కౌంటింగ్ సెంటర్ కు రావాలని తెలిపారు. కౌంటింగ్ కు 14 టేబుల్ ఏర్పాటు చేయగా.. మూడంచెల బందోబస్తు, మొదటి దశలో సివిల్ పోలీస్, రెండవ దశలో స్టేట్ ఆర్మీ పోలీస్, మూడవ దశలో కేంద్ర బలగాలు ఉంటాయని తెలిపారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు, ఉదయం 9 గంటలకు ఈవీఎంల లెక్కింపు ప్రారంభం అవుతుందన్నారు. ఉదయం 9:30 గంటలకు మొదటి రౌండ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.. మొత్తం కౌంటింగ్ ప్రక్రియ సాయంత్రం వరకు ముగుస్తుందని తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఒక్కో నియోజకవర్గానికి ఒక సాధారణ పరిశీలకులను నియమించిందని, సాధారణ పరిశీలకుల పర్యవేక్షణలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని రోనాల్డ్ రోస్ తెలిపారు.
తాజావార్తలు
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
-
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్‌మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
-
IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
-
CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు