పొత్తులపై ఇప్పటికే అభిప్రాయ సేకరణ పూర్తైంది.. ఏపీ ముఖ్య నేతలమంతా పొత్తులపై మా అభిప్రాయాలు అధిష్టానానికి చెప్పేశాం. ఇక, పొత్తులపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పొత్తులపై చర్చ సాగుతోంది. కుదిరిన పొత్తులపై క్లారిటీ లేకపోగా.. కొత్త పొత్తులపై సీఎం వైఎస్ జగన్ మాట్లాడడం.. కొత్త చర్చకు దారి తీసింది.. అసలు సీఎం వైఎస్ జగన్ ఉద్దేశం ఏంటి? అనేది ఆసక్తికరంగా మారింది. ఆయన వ్యాఖ్యలతో పొత్తుల విషయం ఇంకా అస్పష్టంగానే ఉందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.. పొత్తుల విషయం ఇంకా ఉందంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.