Election Commission: మూడు రాష్ట్రాల్లోని 10 రాజ్యసభ స్థానాలకు జూలై 24న ఎన్నికలు జరగనున్నాయి. బెంగాల్లో అత్యధిక స్థానాలు ఆరు ఉండగా.. గుజరాత్లో మూడు స్థానాలు, గోవాలో ఒకటి ఉన్నాయి. అదే రోజు ఓట్ల లెక్కింపు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. జూలై 13లోగా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. బెంగాల్లో డెరెక్ ఓబ్రెయిన్, డోలా సేన్, ప్రదీప్ భట్టాచార్య, సుస్మితా దేవ్, శాంత ఛెత్రి, సుఖేందు శేఖర్ రేల పదవీకాలం ముగియనుంది.
గుజరాత్లో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, దినేష్ జెమల్‌భాయ్ అనవాడియా, లోఖండ్వాలా జుగల్ సింగ్ మాథుర్జీల పదవీకాలం కూడా ముగియనుంది. గోవాలో ఎంపీ వినయ్ టెండూల్కర్ పదవీ కాలం ముగియనుంది. ఆయా స్థానాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ జులై 6న విడుదలవుతుందని తెలిపింది. జూలై 13 వరకు నామినేషన్లు స్వీకరణ, ఉపసంహరణకు జులై 17న చివరి తేదీగా పేర్కొంది. 24న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరుగుతుందని, అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
Also Read: Rahul Gandhi: జూన్ 29న మణిపూర్ పర్యటనకు రాహుల్‌గాంధీ
గత ఏడాది జులైలో జరిగిన చివరి రౌండ్ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది. రాజస్థాన్‌లో కాంగ్రెస్ మూడు స్థానాలను నిలబెట్టుకోగా, రాజస్థాన్, మహారాష్ట్రల్లో ఒక్కో స్థానంలో విజయం సాధించింది. పశ్చిమ బెంగాల్‌లోని ఒక రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. గోవా మాజీ ముఖ్యమంత్రి లుజిన్హో ఫలేరో తన స్థానానికి, తృణమూల్ కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది.