రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి తనకు వ్యూహం ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు అన్నారు. తమకు మెజారిటీ ఉందని, మూడు రాజ్యసభ స్థానాలు తమకే వస్తాయని ప్రసాద్ రాజు ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ అడ్డదారులు తొక్కాలని, ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టాలని చూస్తోందని మండిపడ్డారు. ప్రతిపక్షం అడిగే ఏ అంశంపై అయినా చర్చించటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. త్వరలోనే స్పీకర్ ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు చెప్పారు. ఆదివారం…
మూడు రాష్ట్రాల్లోని 10 రాజ్యసభ స్థానాలకు జూలై 24న ఎన్నికలు జరగనున్నాయి. బెంగాల్‌లో అత్యధిక స్థానాలు ఆరు ఉండగా.. గుజరాత్‌లో మూడు స్థానాలు, గోవాలో ఒకటి ఉన్నాయి.
టీఆర్ఎస్ పార్టీ తరుపున రాజ్యసభ స్థానాలకు పేర్లను ఖరారు చేశారు సీఎం కేసీఆర్. హెటిరో సంస్థ అధినేత డా.బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి), నమస్తే తెలంగాణ ఎండీ దీవకొండ దామోదర్ రావులను టీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపికచేశారు సీఎం కేసీఆర్. తెలంగాణలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఒక రాజ్యసభ స్థానానికి రేపే ఆఖరు తేదీ ఉండటంతో ఈ రోజు అభ్యర్థులను ప్రకటించింది. డీ.…