చాలా మందికి ఉదయం లేవగానే పరగడుపున టీ తాగే అలవాటు ఉంటుంది. ఇతర దేశాల్లో ఉండే బెడ్ కాఫీ అలవాటు మన దేశంలో చాలా మందికి బెడ్ టీ గా ఉంటుంది. ఇలా లేవగానే వేడిగా ఓ ఛాయ్ పడితే ఎంతో ఉత్సాహంగా అనిపిస్తుంది. దీని వల్ల నిద్రమత్తు ఒక్క దెబ్బకు పోతుంది. అయితే దీని వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు కలుగుతాయి. టీ తాగడం వలన ఎసిడిటీ, గుండెల్లో మంట, గ్యాస్ లాంటి సమస్యలు వస్తాయి. మనలో చాలా మందికి రోజులో చాలా సార్లు టీ తాగే అలవాటు ఉంటుంది. ఒత్తిడి కారణంగా ఇలా చేస్తూ ఉంటారు. అయితే ఇలా టీ తాగడం వల్ల ఎసిడిటీ, గుండెల్లో మంట, గ్యాస్ లాంటి సమస్యలు దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తాయి.
Also Read: Bharat Express: నేడు 9 వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లను ఏకకాలంలో ప్రారంభించనున్న మోడీ
ఈ అలవాడు నోటిలోని బ్యాక్టీరియా షుగర్ లెవెల్స్ ను పెంచుతుంది.టీ లో ఉండే పదార్థాలు శరీరంలో మూత్రస్థాయిని కూడా పెంచుతాయి.దీని వలన శరీరంలోని నీరంతా బయటకు పోతుంది. ఖాళీ కడుపుతో టీ తాగితే డిహైడ్రేషన్ కు కూడా గురయ్యే ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది నిర్జిలీకరణ సమస్యకు దారితీస్తుంది. టీ లేదా కాఫీ లో ఎసిడిక్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తాగడం వలన ఎసిడిటికీ కారణమవుతుంది. టీ తాగితే మనకు చాలా సేపు ఆకలి అనిపించదు. దీనికి కారణం జీర్ణక్రియ క్షీణించడమే. దీని వ్లల శరీరానికి శక్తి అందదు. ఆ కారణంగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. అంతే కాదు టీ కారణంగా మలబద్దకం లాంటి సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి. నిద్రలేమి, బరువు పెరగడం, ఆకలి మందగించడం, రక్తపోటు వంటి సమస్యలు కూడా టీ తాగడం వల్ల కలుగుతాయి.