Edible-Oil-Prices: గత కొన్ని నెలలుగా ఎడిబుల్ ఆయిల్ ధరలు కొత్త గరిష్టాలను తాకాయి. పండుగల సీజన్‌కు ముందు వంటనూనె ధరలు తగ్గుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా దెబ్బతిన్న దిగుమతులు మళ్లీ ట్రాక్‌లోకి రావడంతో ఇప్పుడు ధరలు తగ్గుతున్నాయి. కొన్ని రోజుల క్రితం సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటరు రూ. 180 ఉండగా ప్రస్తుతం రూ.155కు దిగొచ్చింది. పామాయిల్ ఇప్పుడు లీటరు రూ.100 లోపే విక్రయిస్తున్నారు. రైస్ బ్రాన్ ఆయిల్, వేరుశెనగ నూనె ధరలు అదే స్థాయిలో తగ్గలేదు కానీ లీటర్ రూ.165-175 వద్ద స్థిరంగా ఉన్నాయి. బ్రాండ్ రకాన్ని బట్టి ధరలు మారుతూ ఉంటాయి.
‘సన్ ఫ్లవర్ ఆయిల్ ధరలు రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముందు స్థాయికి తిరిగి వచ్చాయి. దిగుమతి సుంకాలు తగ్గించబడ్డాయి. పామాయిల్ సరఫరా కూడా తగ్గింది. తెలంగాణ సహా దేశంలోని పలు రాష్ట్రాలు దేశీయంగా నూనె గింజల ఉత్పత్తిని పెంచడంపై దృష్టి సారించాయి. వాటి ఫలితాలు త్వరలో వస్తాయి’ అని ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర రెడ్డి అన్నారు.
Read Also: Snake Venom: డార్జిలింగ్‌లో 2.5కేజీల పాము విషం పట్టివేత.. విలువ రూ.30కోట్లు
కోవిడ్ మహమ్మారి కారణంగా దేశంలోని ఎడిబుల్ ఆయిల్ మార్కెట్ గత రెండేళ్లలో వినియోగ విధానాల్లో మార్పును చూసింది. కోవిడ్ మూడు వేవ్ ల్లోనూ వినియోగ విధానాలు మారాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మార్చిలో జరిగినప్పటికీ, అంతర్జాతీయ ఎడిబుల్ ఆయిల్ ట్రేడింగ్ లో మార్పులు డిసెంబరు నుండి మొదలైంది. కోవిద్ మొదటి వేవ్‌లో చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండడం.. అదీకాక మంచి ఆహారం తీసుకోవడంపై దృష్టి పెట్టారు. దీంతో గృహ వినియోగం పెరిగింది. అంతే కాకుండా ఆయిల్ కంపెనీలకు లేబర్, ప్యాకేజింగ్ మెటీరియల్ పొందడంలో సమస్యలు ఏర్పడ్డాయి. ట్రక్కులు అందుబాటులో లేవు. దీంతో వంటనూనెల ధరలు గణనీయంగా పెరిగాయి.
Read Also: Dehi Liquor Scam: లిక్కర్ స్కాం.. కీలక నేత అరెస్టుకు రంగం సిద్ధం?
రెండో వేవ్‌లో చాలా మంది కోవిద్ బారినపడ్డారు. మరణాల సంఖ్య పెరిగింది. దీంతో జనం వైద్య ఖర్చుల నిమిత్తం పొదుపు చేయడంపై దృష్టి పెట్టారు. జనం రద్దీగా ఉండే ప్రదేశాలు లేదా ఎయిర్ కండిషన్డ్ ప్రాంగణాల్లోకి వెళ్లేందుకు సిద్ధంగా లేకపోవడంతో సూపర్ మార్కెట్లలో విక్రయాలు దెబ్బతిన్నాయి. దక్షిణ భారతదేశంలోని చాలా ప్రాంతాలు ఉక్రెయిన్ నుండి సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై ఆధారపడి ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ ఆయిల్ ఎగుమతులపై దెబ్బపడింది. మలేషియా కూడా ఎగుమతులపై పరిమితులను విధించాయి. ఇవ్వన్నీ ఆయిల్ ధరల పెరుగుదలకు దారితీశాయి. వీటికి తోడు రూపాయి క్షీణించడం వల్ల దిగుమతులు మరింత ప్రియమయ్యాయి. ప్రస్తుతం నాటి పరిస్థితుల నుంచి కొంత ప్రపంచం తేరుకోవడంతో దిగుమతులు ట్రాక్ లోకి వస్తున్నాయి. దాంతో ఈ ఏడాది సోయా, సన్ ప్లవర్, పామ్ ధరలు క్రమంగా దిగివస్తున్నాయని విశ్లేషకులు తెలుపుతున్నారు.