నిత్యావసర వస్తువైన వంట నూనె వినియోగం పెరుగుతోంది. డిమాండ్ కు తగిన ఉత్పత్తి లేకపోవడంతో భారత్ వంట నూనెను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దేశీయ డిమాండ్‌ను తీర్చడానికి, భారత్ 2024-25 మార్కెటింగ్ సంవత్సరంలో (అక్టోబర్ వరకు) 16 మిలియన్ టన్నుల వంట నూనెలను దిగుమతి చేసుకుంది. మొత్తం ఖర్చు రూ. 1.61 లక్షల కోట్లు అని పరిశ్రమ సంస్థ సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SEA) గురువారం విడుదల చేసిన డేటా వెల్లడించింది. Also…
భారతదేశంలో అనేక రకాల నూనెలను వంటలకు ఉపయోగిస్తారు. వేరుశెనగ నూనె, పొద్దుతిరుగుడు నూనె, రైస్ బ్రాన్ ఆయిల్, నువ్వుల నూనె, ఆలివ్ నూనె, ఆవాల నూనె మొదలైన అనేక రకాల నూనెలు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ప్రతి ఒక్కరూ తమ ఇష్టానుసారంగా ఆహారంలో నూనెను వాడతారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం కొన్ని రకాల నూనెలను వంటలో ఉపయోగించకూడదని అంటున్నారు. ఇందులో పామాయిల్ కూడా ఉంది. దీనిని ఉపయోగిస్తే గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందని చెబుతున్నారు.
పండుగల సీజన్‌లో ఎడిబుల్ ఆయిల్ ధరలు ఆకాశాన్నంటాయి. గత నెలలో పామాయిల్ ధరలు 37% పెరిగాయి. దీంతో సామాన్యుడి ఇళ్లు గడవడం కష్టంగా మారింది. ఈ నూనెతో స్నాక్స్ తయారు చేసే రెస్టారెంట్లు, హోటళ్లు, స్వీట్ షాపుల ఖర్చులు కూడా పెరిగాయి.
Oil Rates Hike: కేంద్ర ప్రభుత్వం వంట నూనెల దిగుమతి సుంకాన్ని పెంచుతుందని ప్రకటించిన వెంటనే వాడి ధరలు అమాంతం పెరిగిపోయాయి. అది కూడా ఏకంగా లీటర్ కు 15 రూపాయల నుంచి 20 రూపాయల వరకు పెరిగాయి. శనివారం నాడు 115 రూపాయలు ఉన్న సన్ ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ అదే రోజు సాయంత్రానికి 130 రూపాయలకు చేరుకుంది. ఇక బయటి మార్కెట్లో 100 రూపాయలు ఉన్న పామాయిల్ ప్రస్తుతం 115 రూపాయలు అయింది. కేంద్ర…
Edible Oil Import Reduced : దేశంలోని ఎడిబుల్ ఆయిల్ దిగుమతి జనవరిలో వార్షిక ప్రాతిపదికన 28 శాతం తగ్గి 12 లక్షల టన్నులకు చేరుకుంది. సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SEA) సోమవారం ఈ సమాచారాన్ని వెల్లడించింది.
Palm Oil Import: ఎడిబుల్ ఆయిల్ దిగుమతి పెరగడంతో పాటు పామాయిల్ దిగుమతి కూడా వేగంగా పెరుగుతోంది. 2022-23 సీజన్‌లో మొదటి 11 నెలల్లో భారతదేశ పామాయిల్ దిగుమతి 29.21 శాతం పెరిగి 90.80 లక్షల టన్నులకు చేరుకుంది.
Cooking Oil: వంట నూనెలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన ఎడిబుల్ ఆయిల్స్ దిగుమతి సుంకంపై కల్పిస్తున్న రాయితీలను 2023 మార్చి వరకు కొనసాగుతాయని కేంద్ర ఆహార శాఖ ప్రకటించింది.
ప్రస్తుతం వరి కొనుగోలుకి ఇబ్బందులు పడుతున్న వేళ రైతులు వరి పంటకు బదులు ఆయిల్ పాం పంట సాగు వైపు దృష్టి సారిస్తే అధిక లాభాలు ఆర్జించవచ్చు. నిత్యం సాగునీటి వసతి ఉన్న ప్రాంతాల్లోనే ఆయిల్ పాం సాగు చేయడం సాధ్యమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన సాగునీటి వసతి, నిరం తర విద్యుత్ సరఫరా వల్ల ఈ సదుపాయాన్ని రైతాంగం వినియోగించుకోవాలంటున్నారు వ్యవసాయ నిపుణులు. ఆయిల్ పాం పంట సాగు చేసే రైతుల కోసం ఫ్యాక్టరీ నిర్వాహకుల…