ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ల కారణంగా తీవ్రంగా నష్టపోయి ప్రాణాలు తీసుకుంటున్నారు. కుటుంబాలు చిన్నాభిన్నవుతున్నాయి. ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్ లను అరికట్టడానికి.. అలాగే వాటిని ప్రమోట్ చేస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన కేసుల దర్యాప్తుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) గూగుల్, మెటాకు నోటీసులు జారీ చేసింది.
Also Read:Fire Accident In Vizag: విశాఖలోని ఐటీసీ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం.. రూ 100 కోట్ల నష్టం..?
ఈ రెండు కంపెనీలు బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించాయని.. ఈ కంపెనీలు తమ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో వారి ప్రకటనలు వెబ్‌సైట్‌లకు ప్రాధాన్యత ఇచ్చాయని ఏజెన్సీ ఆరోపించింది. ఇప్పుడు ఈడీ గూగుల్, మెటా కంపెనీల ప్రతినిధులను జూలై 21న విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. ఈడీ తీసుకున్న ఈ చర్య ఆన్‌లైన్ బెట్టింగ్‌కు వ్యతిరేకంగా చేస్తున్న చర్యల్లో కీలకంగా మారింది. దీనికి ముందు కూడా, చాలా మంది సినీ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ల్ఫూయెన్సర్లు అక్రమ బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించినందుకు దర్యాప్తు ఎదుర్కొంటున్నారు.
Also Read:UP: యూపీలో మరో ప్రొఫెసర్ అరాచకం.. డెంటల్ స్టూడెంట్ ఆత్మహత్య
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల భారీ నెట్‌వర్క్‌ను ఈడీ నిశితంగా పరిశీలిస్తోంది. ఈ యాప్‌లలో చాలా వరకు తమను తాము ‘స్కిల్ బేస్డ్ గేమ్స్’ అని చెప్పుకుంటూ అక్రమ బెట్టింగ్‌లో పాల్గొంటున్నాయి. ఈ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కోట్లాది రూపాయల విలువైన నల్లధనం సంపాదిస్తున్నారని విశ్వసిస్తున్నారు. ఈ వ్యవహారం బయటపడకుండా హవాలా మార్గాలను ఎంచుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి.
Also Read:Gandikota Crime: గండికోటలో మైనర్ బాలిక హత్య.. టవర్ డంప్స్ ఆధారంగా పోలీసులు విచారణ
గత వారం, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రముఖ నటులు, టీవీ హోస్ట్‌లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌లతో సహా 29 మందిపై కేసు నమోదు చేసింది. వారు అక్రమ బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించారని ఆరోపించారు. ఈడీ ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR) లో పేర్లు నమోదు చేయబడిన ప్రముఖులలో ప్రకాష్ రాజ్, రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ వంటి ప్రముఖుల పేర్లు ఉన్నాయి. ఈ యాప్‌లను ప్రోత్సహించడానికి ఈ వ్యక్తులకు భారీ మొత్తంలో డబ్బు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి.