గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నయీమ్ కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగనుంది. నయీమ్ పెద్ద మొత్తంలో అక్రమ ఆస్తులను కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు. పలువురు రాజకీయ నేతలు, వ్యాపారులకు నయీమ్ బినామీగా ఉండి.. వారి లావాదేవీలకు అండగా ఉండి డబ్బుల తరలింపుకు పాల్పడ్డట్లు గుర్తించారు. కాగా 2016, ఆగష్టులో తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతం అయ్యాడు నయీమ్.. ఇక, నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత పెద్ద మొత్తంలో ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. నయీమ్‌తోపాటు అతడి భార్యాపిల్లలు, బావమరిది, బినామీల పేరుతో పెద్ద ఎత్తున ఆస్తులను గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు నయీమ్ పై మనీలాండరింగ్ కేసు నమోదు చేశారు. తాజాగా ఈడీ చర్యలు ప్రారంభించింది.
Also Read:PM Modi: అమెరికాకు వ్యతిరేకంగా స్వరం పెంచండి.. తహవ్వూర్ రాణాపై మోడీ పాత పోస్ట్ వైరల్
నయీమ్ కు సంబంధించిన 35 ఆస్తులు జప్తు చేసేందుకు ఈడి చర్యలు చేపట్టింది. 35 ఆస్తులను నయీమ్ కుటుంబ సభ్యులు, సన్నిహితుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసినట్లు ఈడి గుర్తింపు.. అక్రమంగా , బలవంతంగా ఈ ఆస్తులను నయీమ్ తమ కుటుంబ సభ్యుల పేర్ల మీద రిజిస్టర్ చేసుకున్నట్టు గుర్తింపు.. 2022 మార్చిలో నయీమ్ ఆస్తులపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడి.. అప్పటి ఐటీ అధికారులు, సిట్ సమాచారంతో ECIR నమోదు చేసిన ఈడి.. ఆస్తులు మొత్తాన్ని నయీమ్ కుటుంబ సభ్యులు హసీనా బేగం ,తహీరా బేగం, సలీమా బేగం, అబ్దుల్ సలీం, అహేలాబేగం, సయ్యద్ నిలోఫర్ ,ఫిర్దోస్ అంజూమ్, మహమ్మద్ ఆరిఫ్ ,హసీనా కౌసర్ పేర్ల మీద రిజిస్టర్ చేసినట్లు ఈడి గుర్తింపు.
Also Read:RCB vs DC: ఆర్‌సీబీ చెత్త రికార్డు.. ఐపీఎల్ తొలి జట్టుగా!
వీరి పేర్లను ECIR lo నమోదు చేసిన ఈడి.. పలుమార్లు ఈడి సమన్లు పంపిన స్పందించని కుటుంబ సభ్యులు.. భువనగిరిలో ఉన్న క్రిస్టియన్ గోస్పెల్ మిషన్ సెక్రెటరీ ప్రభాకర్ నయీమ్ పై ఫిర్యాదు.. నయీమ్ కుటుంబ సభ్యుల పేరు మీద అక్రమంగా ఆస్తులను వ్రాయించుకున్నట్లు వెల్లడి.. ఇన్ని కోట్ల ఆస్తులు సంపాదించిన ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయని నయీమ్ కుటుంబ సభ్యులు.. బినామీ ఆక్ట్ కింద హసీనా బేగం పేరు చేర్చి ఆస్తులను ఈడి జప్తు చేయనున్నది.