SIR Phase-3 : దేశవ్యాప్తంగా ‘SIR ఫేజ్-3’ షెడ్యూల్ విడుదల, అక్టోబర్ 1న తుది జాబితా..!
- తెలంగాణలో ఓటరు జాబితా సవరణ షెడ్యూల్ విడుదల
- ఇంటింటికీ వెళ్లనున్న బూత్ లెవెల్ ఆఫీసర్లు
- జూలై 31న డ్రాఫ్ట్ ఓటరు జాబితా ప్రచురణ
- అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా, ఖచ్చితత్వంతో నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం (ECI) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఓటరు జాబితాల సమగ్ర సవరణ, నవీకరణే (Update) లక్ష్యంగా ప్రతిష్టాత్మక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) – ఫేజ్ 3 కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది. దేశవ్యాప్తంగా మొత్తం 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలలో ఈ డ్రైవ్‌ను దశలవారీగా నిర్వహించనున్నారు. అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడం, డూప్లికేట్ , మరణించిన వారి ఓట్లను తొలగించడమే ఈ #SIR2026 ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం.
ఈ ఫేజ్-3 డ్రైవ్‌లో తెలంగాణ , పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన స్పెషల్ షెడ్యూల్‌ను ఎలక్షన్ కమిషన్ అధికారికంగా రిలీజ్ చేసింది. ఈ సవరణ ప్రక్రియకు అక్టోబర్ 1, 2026 నాటికి అర్హత సాధించే వారిని ప్రామాణికంగా (Qualifying Date) నిర్ణయించారు. తెలంగాణలో జూన్ 15 నుండి జూన్ 24 వరకు ఓటరు జాబితా సవరణకు సంబంధించి ప్రాథమిక సన్నాహాలు, అధికారులకు శిక్షణ (Training) , అవసరమైన ఫారాల ప్రింటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఆ తర్వాత జూన్ 25 నుండి జూలై 24 వరకు బూత్ లెవెల్ ఆఫీసర్లు (BLOs) ప్రతి ఇంటికి స్వయంగా పర్యటించి (House-to-House Visit) అర్హులైన ఓటర్ల వివరాలను సేకరిస్తారు. ఇదే సమయంలో జూలై 24 లోపు పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ (Rationalization) ప్రక్రియను కూడా అధికారులు పూర్తి చేస్తారు.
Also Read
- Workers Salary Hike: తెలంగాణ కార్మికులకు భారీ శుభవార్త.. కనీస వేతనాల పెంపుపై కీలక నిర్ణయం
- KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్‌కి కేటీఆర్ లేఖ
- Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
- IPL Ticket Scam: బాక్స్ టికెట్ ధర 10 లక్షలు.. పెద్దల రిఫరెన్స్ పెట్టినా నో యూజ్.. భారీగా క్యాష్ చేసుకుంటున్న ఎస్ఆర్హెచ్?
ఈ ఇంటెన్సివ్ డ్రైవ్ ముగిసిన తర్వాత, సేకరించిన వివరాల ఆధారంగా జూలై 31న ‘డ్రాఫ్ట్ ఓటరు జాబితా’ (కరడు ఓటరు జాబితా) ను పబ్లిష్ చేస్తారు. ఈ డ్రాఫ్ట్ లిస్ట్‌పై ఓటర్లు తమ అభ్యంతరాలు, క్లెయిమ్స్ (Claims & Objections) దాఖలు చేసుకోవడానికి జూలై 31 నుండి ఆగస్టు 30 వరకు అంటే నెల రోజుల పాటు సమయం ఇస్తారు. అభ్యంతరాలు , క్లెయిమ్స్ అన్నింటినీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి సెప్టెంబర్ 28 లోపు పరిష్కరిస్తారు. చివరగా అన్ని రకాల సవరణలు పూర్తి చేసిన తర్వాత అక్టోబర్ 1న తెలంగాణ అధికారిక ‘తుది ఓటరు జాబితా’ను (Final Electoral Roll) విడుదల చేస్తారు.
ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను వంద శాతం పారదర్శకంగా నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా పొలిటికల్ పార్టీలు కూడా ప్రతి పోలింగ్ బూత్ వద్ద తమ తరపున బూత్ లెవెల్ ఏజెంట్లను (BLAs) నియమించుకోవాలని ఈసీఐ సూచించింది. అర్హత కలిగి ఉండి ఇప్పటివరకు ఓటు హక్కు లేని ప్రతి పౌరుడూ ఓటరుగా నమోదయ్యేలా చూసేందుకు ప్రజలందరూ ఈ డ్రైవ్‌లో భాగస్వాములు కావాలని అధికారులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
SIR Phase-3 : దేశవ్యాప్తంగా ‘SIR ఫేజ్-3’ షెడ్యూల్ విడుదల, అక్టోబర్ 1న తుది జాబితా..!
-
AP: ఏపీ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన కమిటీ నియామకం..
-
Giorgia Meloni: మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు.. మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
-
Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్‌లో పుల్వామా సూత్రధారి హతం..
-
Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!