SIR: ఇటీవల బీహార్ రాష్ట్రంలో కేంద్రం ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) అమలు చేయడం సంచలనంగా మారింది. అక్రమ ఓటర్ల గుర్తించి, ఎన్నికల జాబితా నుంచి వారి పేర్లను తొలగిస్తోంది. అయితే, ఈ ప్రక్రియను ప్రతిపక్షాలైన కాంగ్రెస్, ఆర్జేడీ వంటి పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఎన్నికల కమిషన్‌పై విమర్శలు చేస్తున్నాయి. బీజేపీ-ఈసీ కలిసి ఓట్ల చోరీకి పాల్పడుతోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు.