AP: ఏపీ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన కమిటీ నియామకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమా, టెలివిజన్ , రంగస్థల కళల రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్, అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన చైర్మన్, వైస్ చైర్మన్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల నియామకాలను అధికారికంగా ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కీలక పదవుల నియామకం..
కార్పొరేషన్ ఛైర్మన్ గా.. సంస్థకు కొత్త జవసత్వాలు అందించే బాధ్యతను పి. భరత్ భూషణ్ కి అప్పగించారు. చైర్మన్ హోదాలో ఆయన కార్పొరేషన్ భవిష్యత్తు ప్రణాళికలను ముందుండి నడిపిస్తారు. సంస్థ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి చిక్కాల మెహర్ రమేష్ కుమార్ ను వైస్ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. కేవలం చైర్మన్, వైస్ చైర్మన్లకే పరిమితం కాకుండా.. పరిశ్రమలోని వివిధ రంగాలకు చెందిన నిపుణులకు ఈ బోర్డులో స్థానం కల్పించారు. చైర్మన్, వైస్ చైర్మన్లతో పాటు మరో 14 మందిని డైరెక్టర్లుగా నియమిస్తూ ప్రభుత్వం సమతుల్యమైన కమిటీని ఏర్పాటు చేసింది.
Also Read
- Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
- Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
- Oman Cricket: ఇదేం విచిత్రం రా మావా..! టీమ్‌లో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందిన ప్లేయర్స్..
- Shabari Floods: ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఉగ్రరూపం దాల్చిన శబరి.!
ఈ బోర్డులో నియమితులైన సభ్యులందరి వివరాలను పరిశీలిస్తే.. పి. భరత్ భూషణ్ (ఛైర్మన్), చిక్కాల మెహర్ రమేష్ కుమార్ (వైస్ ఛైర్మన్) లతో పాటు డైరెక్టర్లుగా సుమన్ తల్వార్, ఎస్. శివాజీ, చదలవాడ శ్రీనివాసరావు, బుర్రా సాయిమాధవ్, వై. ఝాన్సీ, కూచిభొట్ల సుబ్రహ్మణ్య వివేకానంద, వి. సముద్ర, కే. ఉమామహేశ్వర రావు, మీర్.ఎస్, కందిమళ్ల సాంబశివరావు, ఏ. సత్యనారాయణ, ఎస్. వెంకట కృష్ణారెడ్డి, జీ. రాజ్ వెంకటేశ్వర యాదవ్, డి. సత్యనారాయణలు ఉన్నారు.
ఈ నియామకాల ప్రాధాన్యత..
ఈ నూతన బోర్డులో సీనియర్ నటులు, దర్శకులు, నిర్మాతలు, ప్రముఖ రచయితలు, సాంకేతిక నిపుణులకు చోటు దక్కింది. పరిశ్రమలోని అన్ని విభాగాల సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తులను ఎంపిక చేయడం ద్వారా, క్షేత్రస్థాయిలో కళాకారులకు న్యాయం జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధిని వేగవంతం చేయడం, స్థానిక థియేటర్ల సమస్యలను పరిష్కరించడం, టెలివిజన్ రంగానికి ప్రోత్సాహం అందించడంతో పాటు.. నిర్వీర్యమవుతున్న నాటకరంగానికి (థియేటర్) పూర్వ వైభవం తీసుకురావడంలో ఈ కొత్త కమిటీ కీలక పాత్ర పోషించనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కళాకారులు, పరిశ్రమ వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
తాజావార్తలు
-
Indian Ocean: హిందూ మహాసముద్రంపై యుద్ధమేఘాలు..నెక్ట్స్ ఏం జరగనుంది?
-
Iran Ceasefire Proposal: ఇరాన్ శాంతి ప్రతిపాదనకు ట్రంప్ నో.. 7 రోజుల కాల్పుల విరమణ ప్లాన్ తిరస్కరణ
-
Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
-
Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
-
iQOO 16: iQOO 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లే!
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!