ప్రస్తుతం భారత దేశం మొత్తం డిజిటల్ లోకి మారుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో దాదాపు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ వాడుతున్న వారు అది లేకపోతే ఉండలేదు. కొన్ని సార్లు ఆ ఫోన్ ఎక్కడో పెట్టి మర్చిపోయి కంగారు పడుతుంటారు. ఒకవేళ ఆ ఫోన్ పోతే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయడం వంటివి చేస్తుంటారు. అయితే మీ ఫోన్ పోతే ఇప్పుడు దానిని ఈ పద్దతిలో వెతకడం సులువు. ఒకవేళ మీ ఫోన్ పోయిన.. లేదనే ఎక్కడ పెట్టారో గుర్తుకు రాకపోయినా ఇలా చేయండి.
”మీ ఫోన్ లో రిజిస్టర్ చేసుకున్న జీమెయిల్ అకౌంట్ లోకి లాగిన్ అవ్వండి. ఆ తర్వాత గూగుల్ సెర్చ్ లోకి వెళ్లి ‘where is my phone’ అని టైప్ చేయండి. అప్పుడు అక్కడ గూగుల్ మ్యాప్ మీద ఓ బాక్స్ వస్తుంది. దానిని కిల్క్ చేస్తే మీ ఫోన్ ఉన్న లొకేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు మీ ఎడమ వైపు ఇంకో బాక్స్ వస్తుంది. అందులో రింగ్, లాక్, ఎరేస్ అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో మీరు ‘రింగ్’ ఎంచుకుంటే మీ ఫోన్ సైలెంట్ లో ఉన్న 5 నిమిషాలపాటు మోగుతుంది. ‘లాక్’ ఆప్షన్ ఎంచుకుంటే.. మీ ఫోన్ కు కొత్త లాక్ సెట్ చేసుకోవచ్చు. ‘ఎరేస్’ ను ఎంచుకుంటే మీ ఫోన్ లో ఉన్న సమాచారాన్ని మొత్తం డిలీట్ చేయవచ్చు. అలాగే నా ఫోన్ పోయింది అంటూ మెసేజ్ కూడా చేయవచ్చు.” ఇకమీదట మీ ఫోన్ పోతే కంగారు పడకుండా ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి.