మీరు స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్లలో రిస్క్ తీసుకోకుండా ప్రభుత్వ పథకాలలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే ఇది మంచి అవకాశం. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకంలో కేవలం రూ. 100తో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. గరిష్ట పరిమితి సైతం లేదు. రికరింగ్ డిపాజిట్స్ అనేవి ఓ ప్రత్యేకమైన టర్మ్ డిపాజిట్లు. అయితే తక్కువ సమయంలో భారీ లాభాలు పొందాలనుకునే వారికి పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ మంచి ఎంపిక. ఈ పథకంలో మీరు నెలా నెలా తమకు నచ్చినంత పొదుపు చేసుకోవచ్చు. ప్రస్తుతం 6.7 శాతం మేర వడ్డీ అందిస్తున్నారు.
READ MORE: KA Paul: నా కొడుకు అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలి.. కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత కావాలనుకుంటే ఈ పథకాన్ని మరో 5 సంవత్సరాలు పొడిగించవచ్చు. కనీసం రూ.100 నుంచి ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ఠంగా ఎంతైనా పెట్టవచ్చు. దానికి పరిమితి లేదు. అయితే రానున్న త్రైమాసికానికి స్మాల్ సేవింగ్ స్కీమ్స్ వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. అది ఇందులో ఇన్వెస్ట్ చేసే వారికి అదనపు ప్రయోజనం కల్పిస్తుంది. పోస్ట్ ఆఫీస్ ఆర్‌డి పథకం కింద ఎవరైనా పెట్టుబడి పెట్టొచ్చు. 10 సంవత్సరాల వయస్సు గల ఏ మైనర్ అయినా వారి తల్లిదండ్రుల సహాయంతో ఖాతా తెరవవచ్చు. 18 సంవత్సరాలు నిండిన తర్వాత, మైనర్ కొత్త కేవైసీ, కొత్త ఓపెనింగ్ ఫారమ్‌ను ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఈ ఖాతాను మొబైల్ బ్యాంకింగ్ లేదా ఇ-బ్యాంకింగ్ సౌకర్యం ద్వారా తెరవవచ్చు.
READ MORE:Rajinikanth : కమలహాసన్ అంత మేధావిని కాదు నేను.. రజనీకాంత్ కామెంట్స్ వైరల్ !
35 లక్షల ప్రయోజనాన్ని ఎలా పొందాలి?
మీరు పోస్టాఫీసుకి చెందిన ఈ పథకంలో ప్రతి నెలా 50 వేల రూపాయలు పెట్టుబడి పెడితే, 5 సంవత్సరాలలో 30 లక్షల రూపాయలు జమ అవుతాయి. దీనితో పాటు, సంవత్సరానికి 6.7 శాతం వడ్డీ కలుపుకుని 5 సంవత్సరాలలో రూ. 5,68,291 సంపాదించవచ్చు. ఇది టీడీసీ తగ్గింపు కిందకు వస్తుంది. ఈ విధంగా ఐదు ఏళ్లలో మొత్తం రూ. 35,68,291 పొందుతారు.