ఎస్. వెంకటేశన్ రచించిన ‘వేల్పారి’ పుస్తాకానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తున్న నేపథ్యంలో, శుక్రవారం సాయంత్రం చెన్నైలో ఒక ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా మారాయి. రజనీకాంత్ తన ప్రసంగంలో పుస్తకం పై గాఢమైన అభిమానం వ్యక్తం చేస్తూ, ఆత్మీయతతో కూడిన మాటలతో అందరినీ అలరించారు.
Also Read : Lenin : అఖిల్ లెనిన్ మూవీ అప్డేట్ – హీరోయిన్ ఛేంజ్ పై క్లారిటీ
“ఇలాంటి సాహిత్యక సమావేశాలకు కమలహాసన్ లేదా శివకుమార్ లాంటి మేధావుల్ని పిలవాలి. నన్ను పిలవడమెంటీ 75 ఏళ్ల వయసులో కూలింగ్ గ్లాసులు పెట్టుకుని స్లో మోషన్‌లో నడిచే నన్ను ఎందుకు ఆహ్వానించారో నాకు అర్థం కావడం లేదు” అని నవ్వుతు తెలిపారు, అలాగే “మనం ఏం మాట్లాడాలనేది విజ్ఞానం.. ఎలా మాట్లాడాలనేది ప్రతిభ, ఎంత మాట్లాడాలనేది స్టేజ్.. ఏం చెప్పాలి. ఏం చెప్పకూడదు అనేది అనుభవం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు. ఇటీవల ఓ కార్యక్రమంలో నేను చేసిన వ్యాఖ్యలు ఒకింత వివాదానికి దారితీశాయి. అందుకే ఈసారి ఆచితూచి మాట్లాడాలనుకుంటున్నాను’ అంటూ రజనీకాంత్ తెలిపారు.