ఏపీ ట్రాఫిక్ ఈ చలాన్ స్కామ్‌పై కేసు నమోదు చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. ట్రాఫిక్ చలాన్ల వసూళ్ల ద్వారా వచ్చిన నిధులను అవినాష్ అనే వ్యక్తి దారిమళ్లించినట్టు అభియోగాలు మోపారు.. అవినాష్ కి చెందిన ఇవాల్వ్ సంస్థతోపాటు పలువురుపై కేసు నమోదు చేశారు.. 36 కోట్ల రూపాయలకు పైగా నిధులను దారి మళ్లించారని అవినాష్ పై ఆరోపణలు ఉన్నాయి.
ఏపీ ఈ-చలాన్‌ల డబ్బును మాయం చేశారని గుంటూరు రేంజ్ ఐజీ పాల్ రాజు వెల్లడించారు. డీజీ అకౌంట్‌కు అనేక రకాల రూపాలలో ఈ- డేటా చలానాకు సంబంధించిన డబ్బులు వస్తాయని.. డీజీ అకౌంట్స్ ద్వారా వచ్చే నగదు మాయమవడం మొదలైందని ఆయన తెలిపారు.