ఈ రోజుల్లో సినిమాలు థియేటర్లలో నిలబడాలంటే బలమైన కథ, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తప్పనిసరి. ఏ మాత్రం స్టోరీ బాగలేకున్నా ప్రేక్షకులు థియేటర్ కు వచ్చేందుకు ఇష్టపడడం లేదు. ఇక మిడ్ రేంజ్ హీరోల పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు. టాలీవుడ్ ‘నవ దళపతి’ గా బిరుదు పొందిన సుధీర్ బాబు ప్రధాన పాత్ర పోషించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘హరోం హర’. జ్ఞాన సాగర ద్వారక దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం హిట్ అయి తన ఫ్లాప్ ల పరంపరకు బ్రేక్ వేస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు సుధీర్ బాబు. కానీ జూన్ 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. హింస, రక్తపాతం అనవసరపు హంగులు మోతాదుకు మించడంతో ప్రేక్షకులు తిప్పికొట్టారు.
కాగా హరోంహర ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు ప్రటించారు రైట్స్ కొనుగోలు చేసిన ఆహా, ఈటీవీ విన్. వాస్తవానికి హరోంహర ఓటీటీలో ఈ నెల 11 నుంచి స్ట్రీమింగ్ కావాల్సి ఉండగా టెక్నికల్ కారణాల కారణంగా ఆ రోజు విడుదల కాలేదు. ఓటీటీలో సుధీర్ బాబు సినిమాలకు ఆదరణ ఉండడంతో భారీ ధర వెచ్చించి నాన్ థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేశారు ఆహా, ఈటీవీ విన్. ఓటీటీ విడుదల వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు ఈ రోజు సాయంత్రం 5:00గంటలకు స్ట్రీమింగ్ కు ఉంచనున్నట్టు రెండు తెలుగు ఓటీటీ సంస్థలు ప్రకటించాయి. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోని ఈ చిత్రం ఓటీటీలో ఎంతమాత్రం వ్యూస్ సాధిస్తుందో చూడాలి. 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో మాళవికా శర్మ హీరోయిన్. లక్కీ లక్ష్మణ్, రవి కాలే, సునీల్ తదితరులు నటించారు