Bollywood vs Malayalam Industry: భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ దుల్కర్ సల్మాన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్‌లో పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నారు దుల్కర్. హిందీ, మలయాళ చిత్ర పరిశ్రమల మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని అన్నారు. హిందీ చిత్రసీమలో నటించేటప్పుడు పెద్ద స్టార్ అని అనిపించుకోకపోతే వాళ్లు ఎంతో నిర్లక్ష్యం చేస్తారని వెల్లడించారు. కార్వాన్ చిత్రంతో 2018లో దుల్కర్ హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు.
ఇంటర్వ్యూలో భాగంగా దుల్కర్ మాట్లాడుతూ.. ‘‘నేను బాలీవుడ్‌లో నటించేటప్పుడు ఎప్పుడూ నా చుట్టూ ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. నేను స్టార్ అని అందరినీ నమ్మించాల్సి వచ్చింది. మన చుట్టూ జనాలు ఉంటేనే వాళ్లు మనల్ని గుర్తిస్తారు. లగ్జరీ కారులో వస్తేనే మనల్ని స్టార్ అనుకుంటారు. లేకపోతే నాకు కనీసం కూర్చోవడానికి కుర్చీ కూడా ఉండదు. మోనిటర్ చూడడానికి స్థలం కూడా ఇవ్వరు. కానీ మలయాళ సినిమా సెట్‌లో బాలీవుడ్‌లో ఉన్న పరిస్థితికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ ఇండస్ట్రీలో చిత్రాలను తెరకెక్కించడానికి ఎక్కువ ఖర్చు ఉండదు, ఇక్కడి వాళ్లు లగ్జరీకి ప్రాధాన్యం ఇవ్వరు, అలాగే రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాల్లో షూటింగ్ చేస్తాం, ఇక్కడ మరొక విషయం ఏమిటంటే చాలా వరకు అన్నీ ఇంటినుంచి తెచ్చుకుంటాం’’ అని దుల్కర్ అన్నారు. ఇటీవలే ఈ స్టార్ హీరో ‘కాంత’ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా డిసెంబర్ 12 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రసారం కానున్నట్లు సమాచారం.
READ ALSO: Amaravati Land Pooling: ఏపీ రాజధానిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్.. ఉత్తర్వులు జారీ..