తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ వంతెన పిల్లర్‌లో కొంత భాగం స్వల్పంగా మునిగిపోయే సూచనలు కనిపించడంతో ఉద్రిక్తత నెలకొంది. శనివారం రాత్రి బ్యారేజీ సమీపంలో పెద్ద శబ్ధం రావడంతో స్థానికులు అప్రమత్తమై అధికారులు అప్రమత్తమయ్యారు. బ్యారేజ్‌లోని 15 నుంచి 20 వరకు ఉన్న పిల్లర్ల మధ్య ఉన్న ఆరో నుంచి ఎనిమిదో బ్లాక్‌లు మునిగిపోయినట్లు ఆ తర్వాత తెలిసింది. ఈ నేపథ్యంలో ఆదివారం కాంగ్రెస్ నాయకులు సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. బ్యారేజీ దగ్గరకు వెళ్లకుండా ఎమ్మెల్యే శ్రీధర్‌బాబును పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సరిగ్గా ఏమి జరిగిందో తనిఖీ చేయడానికి మాకు అనుమతి ఇవ్వడం లేదని, నీటిని పూర్తిగా విడుదల చేస్తే లోతట్టు ప్రాంతాలపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు.
Also Read : Bussiness Idea : తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఇస్తున్న వ్యాపారం.. రైతులకు మంచి ఆదాయాన్ని ఇస్తున్న పంట..
వంతెనను రీడిజైన్ చేయడం మంచిది కాదు అని శ్రీధర్ బాబు అన్నారు. దీనికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. ఇంజనీర్లే ఈ సంఘటనలకు పూర్తి భాద్యత వహించాలని, ఈఎన్ సీ పై చర్యలు తీసుకోవాలన్నారు. బ్యారేజ్ లో ఎలాంటి లోపాలు లేకుంటే.. ప్రజలను ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. నాణ్యత లేకుండా మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం చేపట్టారని, ప్రజల సొమ్మును నీళ్లలో పోశారన్నారు. రీ డిజైనింగ్ తప్పిదం, నాణ్యత లోపం వల్లనే వంతెన కుంగిందన్నారు. కుంగిన బ్యారేజ్ లను మా జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ చూడడానికి రావాల.. మునిగిన మోటార్లను చూడడానికి రావల అని ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు..
Also Read : Pentagon Report: భారత సరిహద్దుల్లో పెరిగిన చైనా సైనిక ఉనికి.. 500కు పైగా న్యూక్లియర్ వార్‌హెడ్స్..