Drugs Seized in Gujarat: గుజరాత్ రాష్ట్రంలో డ్రగ్స్ మరోసారి కలకలం రేపింది. ఈ తనిఖీల్లో అధికారులు పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ పోలీసులు డ్రగ్స్ ఆపరేషన్ లో 400 కిలోలకు పైగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. సూరత్, భరూచ్ పోలీసులు సంయుక్తంగా భరూచ్ జిల్లాలోని అంక్లేశ్వర్ జిఐడిసి ప్రాంతంలోని అవ్సర్ ఎంటర్‌ప్రైజెస్‌లో సోదాలు నిర్వహించారు. విచారణలో రూ.250 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇందులో భాగంగా 14.10 లక్షల విలువైన 141 గ్రాముల ఎండీ డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 427 కిలోల అనుమానిత మందులను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపారు. ఈ కేసుకు సంబంధించి అధికారులు ముగ్గురిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
Read Also: Rebal Star : ‘స్పిరిట్’ లో ప్రభాస్ క్యారక్టర్ ఏంటో చెప్పేసిన సందీప్ రెడ్డి వంగా
జిల్లా పోలీసు శాఖ, సూరత్ పోలీసులు పక్కా సమాచారం మేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించినట్లు స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ అధికారి ఆనంద్ చౌదరి తెలిపారు. ఇందుకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ను నిర్ధారించే కొరకు ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్‌ఏఎల్)కు పంపినట్లు ఆయన తెలిపారు. ఇకపోతే అక్టోబర్ 13న గుజరాత్, ఢిల్లీ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో కూడా అదే ప్లాంట్ పక్కనే ఉన్న అవ్కార్ ప్లాంట్ నుండి 5,000 కోట్ల రూపాయల విలువైన 500 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ దాడులలో 40 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి ఉంది.
Read Also: IND vs NZ: అతడికి సన్నటి నడము లేదని సెలెక్ట్ చేయలేదు.. బీసీసీఐపై గవాస్కర్ సెటైర్స్!