Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Drone Show In Hyderabad As Part Of Telangana Formation Celebrations

Drone Show: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో డ్రోన్‌ షో

Published Date :June 5, 2023 , 8:16 am
By NTV WebDesk
Drone Show: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో డ్రోన్‌ షో
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌ నగరంలోని దుర్గం చెరువులో డ్రోన్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డ్రోన్‌ చిత్రాలు ఆకట్టుకున్నాయి. దుర్గం చెరువు వద్ద డ్రోన్ షో వీక్షకులను కనువిందు చేసింది. కేబుల్ బ్రిడ్జిపై ఒకేసారి 500 డ్రోన్స్ ప్రదర్శించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. జూన్​ 3న రైతు దినోత్సవం ఘనంగా జరుపుకున్న ప్రజానికం.. జూన్​ 4న సురక్షా దినోత్సవం జరుపుకున్నారు. ఈ వేడుకలో భాగంగా ఆదివారం సాయంత్రం దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దగ్గర లేజర్, త్రీడీ షోను ప్రదర్శించారు.

Also Read : OPEC Plus: సౌదీ అరేబియా నిర్ణయంతో భారత్‎కు గట్టి ఎదురుదెబ్బ.. పెట్రోల్ ధరలు ఇక తగ్గనట్లే

ఆ లేజర్ ​షోలో తెలంగాణ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఎంతగా అభివృద్ధి చెందిందో తెలుపుతూ.. వాటి విజువల్స్ ను ప్రదర్శించారు. మొదటగా దశాబ్ది ఉత్సవాల లోగోను చూపిస్తూ.. ఆ తర్వాత తెలంగాణ కోసం ఎందరో తమ ప్రాణాలను అర్పించిన వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేశారు. భారతదేశంలోనే అతిపెద్ద అంబేడ్కర్​ విగ్రహం, తెలంగాణ సచివాలయం, కాళేశ్వరం ప్రాజెక్టు, వేములవాడ మల్లన్న స్వామి, సీఎం కేసీఆర్, టీహబ్, పోలీసుల లోగో, మిషన్​ భగీరథ, డబుల్ బెడ్​రూం, సైబరాబాద్ పోలీస్ ​లోగో, షీ టీమ్స్ లోగో.. ఆఖరికి జై తెలంగాణ జై భారత్​అనే నినాదంతో ఈ లేజర్ షో ​ముగిసింది. ఈ లేజర్ ​షోను చూసేందుకు వచ్చిన ప్రజలు.. ఆ షోను చూసి ఆనందం, కరతాల ధ్వనులతో తెలంగాణ వేడుకలను జరుపుకున్నారు.

Also Read : Andhrapradesh: నేడు ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ

Drone-Show on the Occasion of Telangana Dashabdi Utsavalu at Durgam Cheruvu #TelanganaSurakshaDiwas
https://t.co/3KQKu9y20d

— Cyberabad Police (@cyberabadpolice) June 4, 2023

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Drone show
  • hyderabad
  • laser show
  • police
  • Telangana formation celebrations

తాజావార్తలు

  • Harassment: పైలట్ ట్రైనింగ్ కోసం వచ్చిన యవతి పై శిక్షణ ఇన్స్పెక్టర్ అత్యాచారం..

  • Allu Arjun: అల్లు అర్జున్ పుట్టినరోజున అదిరిపోయే అప్‌డేట్స్.. ‘AA22’ టైటిల్ ఫిక్స్?

  • Vaibhav vs Bumrah: “ఇలా ఉన్నావేంట్రా”.. బుమ్రాకే చుక్కలు చూపించిన వైభవ్.. చరిత్రలో నిలిచిపోయే యంగ్ స్టార్ ఫైట్!

  • Sumanth: మృణాల్‌కు క్షమాపణలు చెప్పిన సుమంత్..!

  • Municipal Ward Delimitation: మున్సిపాలిటీల పునర్విభజన ప్రక్రియకు గడువు పెంచిన సర్కార్..

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions