జూలై 4న రాష్ట్రానికి రాష్ట్రపతి రానున్నారు ప్రకటన వెల్లడైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జులై 4 వ తేదీన హైదరాబాద్ పర్యటన సందర్భంగా వివిధ శాఖల అధికారులు పకడ్బందీ ఏర్పాట్లను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటుచేశారు. డీజీపీ అంజనీ కుమార్ తోపాటు పలు శాఖల ఉన్నతాధికారులు హాజరైన ఈ సమావేశంలో సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, జులై 4 సాయంత్రం అల్లూరి సీతారామరాజు 125 వ జన్మదినం ఉత్సవాలలో పాల్గొంటారని తెలిపారు.
Also Read : Delhi Metro: 15 గంటల్లో 286 స్టేషన్లు కవర్ చేసిన ఓ వ్యక్తి.. గిన్నిస్ వరల్డ్ రికార్డు..!
రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లకు సంబంధించి వివిధ శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జరిగే మార్గాలలో రోడ్ల మరమ్మతులు, బారికేడింగ్ చేపట్టాలని కోరారు. ఈ పర్యటన సందర్భంగా విస్తృత బందోబస్తు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. నిరంతర విద్యుత్ సరఫరా, వైద్య బృందాలను నియమించడం, తగు పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. ప్రోటోకాల్ ను అనుసరించి ఏవిధమైన లోటుపాట్లు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో రాష్ట్రపతి పర్యటనను విజయవంతం చేయాలని సీఎస్ కోరారు.
Also Read : CWC Qualifiers: స్టన్నింగ్ విక్టరీ కొట్టిన జింబాబ్వే.. సీన్ విలియమ్స్ ఊచకోత