తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకే రాష్ట్రపతికి బీసీ బిల్ పంపారని బిజెపి ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ రేవంత్ సర్కార్ పై మండిపడ్డారు. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చెయ్యాలి అంటే.. ఆ బిల్ ను 9 వ షెడ్యూల్ లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి పంపాలని తెలిపారు. కానీ రాష్ట్రపతి కి పంపారు.. రాష్ట్రపతి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో మాకు తెలియదు. తమిళనాడు రిజర్వేషన్లపై సుప్రీం కోర్టులో కేసు ఉంది. బిల్ ను కేంద్రాన్ని కాదని, రాష్ట్రపతికి ఎందుకు పంపించారని ప్రశ్నించారు. 9th షెడ్యూల్ లో లేకుండా బిల్ ఎలా అవుతుంది.. 9th షెడ్యూల్ లో చేర్చకుండా రిజర్వేషన్లు అమలు కాదని స్పష్టం చేశారు.
Also Read:CBSE: కీలక నిర్ణయం.. ఇక నుంచి ఏడాదికి రెండు సార్లు 10వ తరగతి బోర్డు పరీక్షలు..!
90 శాతం ముస్లింలను బీసీల్లో కలపడం రోల్ మోడల్ అవుతుందా..హైదరాబాద్ లో 50 కార్పొరేషన్లు, స్థానిక సంస్థల పటిష్టత కోసం రాజీవ్ గాంధీ చొరవ తీసుకున్నారని కాంగ్రెస్ చెప్తోంది. తెలంగాణలో 18 నెలలు అయినా.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేదు. హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక తీర్పు ఇచ్చింది. గొంతు చించుకుని మాట్లాడుతున్న రాహుల్ గాంధీ ఎందుకు తెలంగాణ లోని అంశాలపై మాట్లాడారని ప్రశ్నించారు. గ్రామాల్లో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల అభివృద్ధికి సంబంధించిన బిల్లులు కూడా చెల్లించలేదు. కొందరు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందని తెలిపారు.
Also Read:V Hanumantha Rao: భర్త కోసం యమధర్మరాజుతో కూడా కొట్లాడిన భార్యలను చూశా.. కానీ ఇప్పుడు..
సమయానికి ఎన్నికల నిర్వహణ జరగకపోవడం వల్ల ఎన్నో కోట్ల నష్టం వాటిల్లింది.. స్ధానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం అని హామీ ఇచ్చారు సీఎం రేవంత్.. అమలు చేయలేక ఇతరులపై నెపం నెడుతున్నారు.. చట్టసభల్లో బిల్ ఆమోదించాం.. రాష్ట్రపతి ఆమోదం కోసం బిల్ పంపించాం అంటే కుదరదు.. చట్టపరంగా చెల్లుబాటు కాకపోతే, పార్టీ పరంగా రిజర్వేషన్లు అంటూ మోసం చేస్తున్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే, హైకోర్టు తీర్పును అమలు చెయ్యాలని కోరారు. ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయింది.. మోడీ ప్రభుత్వం ఈ చీకటి రోజును సంవిధాన్ హత్యా దివస్ గా నిర్వహిస్తోంది.. నేటి తరానికి అనాటి వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందని తెలిపారు.
Also Read:V Hanumantha Rao: భర్త కోసం యమధర్మరాజుతో కూడా కొట్లాడిన భార్యలను చూశా.. కానీ ఇప్పుడు..
ఎన్నో ఆంక్షలు పెట్టి అధికారాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీ వ్యవహరించారు.. రాహుల్ రాజ్యాంగం పట్టుకుని ప్రచారం చేస్తున్నాడు.. అసలు రాహుల్ కుటుంబ సభ్యులే, రాజ్యాంగాన్ని కూని చేశారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ పై లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ నాది కూడా జరిగి ఉండొచ్చు.. నేను పార్టీ అధ్యక్షుడిగా ఉన్నపుడు జరగొచ్చు.. నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐ కి ఇవ్వాలి.. కేంద్ర రంగ సంస్థల భూములు రాష్ట్రానికి ఇస్తే, అమ్ముకోవడానికా.. ముందు రాష్ట్ర ప్రభుత్వ భూములను కాపాడండి అని కోరారు. బిజెపి అధ్యక్ష ఎంపిక పై లక్ష్మణ్ మాట్లాడుతూ.. కొత్త వాళ్ళు,పాత వాళ్ళు అంటూ ఏమి లేదు.. జూలై నెల రెండో వారంలో రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడు నియమితులవుతారు. రాష్ట్ర అధ్యక్షుడి తర్వాత, జాతీయ అధ్యక్షుడి ప్రకటన ఉంటుందని తెలిపారు.