Viral Video: రెప్పపాటులో గుండెపోటుతో కుప్పకూలాడు.. సీపీఆర్ చేసి నిమిషాల్లో.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Doctor saves life: ఈ మధ్య కాలంలో చాలా మంది వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో ప్రాణాలు విడుస్తు్న్నారు. ఆకస్మికంగా గుండెపోటుతో అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. చూస్తుండగానే రెప్పపాటులో కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్నారు. అలా అకస్మాత్తుగా గుండెపోటు సంభవిస్తే సీపీఆర్(కార్డియో పల్మనరీ రిసిటేషన్) చేస్తే బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తాజాగా కర్ణాటకలోని బెంగళూరులో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. బెంగళూరు ఐకియాలో షాపింగ్‌కు వెళ్లిన ఓ వ్యక్తి ఉన్నట్టుండి గుండెపోటుతో కుప్పకూలాడు. అతను ఒక్కసారిగా స్పృహతప్పి కింద పడిపోవడంతో అక్కడున్న వారంతా భయపడిపోడిపోయారు.
New Covid Variant: భారత్లోకి కొత్త కోవిడ్ వేరియంట్.. గుజరాత్లో మొదటికేసు
Also Read
- AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
- Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
- Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
- AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
ఆ సమయంలోనే అదృష్టవశాత్తు తదుపరి లేన్‌లో షాపింగ్ చేస్తున్న ఒక వైద్యుడు (ఆర్థోపెడిక్ సర్జన్) ఆ వ్యక్తిని రక్షించడానికి వచ్చి కార్డియో పల్మనరీ రిసిటేషన్ లేదా సీపీఆర్ చేయడం ప్రారంభించాడు. సకాలంలో బాధితుడి ఛాతీపై చేతితో నొక్కుతూ 10 నిమిషాలపాటు శ్రమించి అతడి ప్రాణాలను కాపాడాడు. ఘటనా స్థలంలో ఉన్న డాక్టర్ కుమారుడు రోహిత్ దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. 10 నిమిషాలకు పైగా ప్రక్రియ కొనసాగిందని డాక్టర్ కుమారుడు వీడియోను పంచుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. సకాలంలో ప్రాణాలు కాపాడిన వైద్యుడిని అభినందనలతో ముంచెత్తుతున్నారు. సకాలంలో వైద్యం చేసి మృత్యువు నుంచి కాపాడి అతడికి కొత్త జీవితాన్ని ప్రసాదించారని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
My dad saved a life. We happen to be at IKEA Bangalore where someone had an attack and had no pulse. Dad worked on him for more than 10 mins and revived him. Lucky guy that a trained orthopedic surgeon was shopping in the next lane. Doctors are a blessing. Respect !!! pic.twitter.com/QXpXTMBOya
— Rohit Dak (@rohitdak) December 29, 2022
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!