మాస్క్ పెట్టుకు రాలేదని జ్వరంతో వచ్చిన ఓ బాలుడికి వైద్యం చేయకుండా నిరాకరించాడు ఓ ప్రభుత్వ వైద్యుడు. వైద్యం కోసం వచ్చే రోగుల పట్ల దురుసుగా ప్రవరిస్తూ పై పెచ్చు కలెక్టర్ తనకు స్నేహితుడు అని చెప్పుకుంటూ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వైద్యుడంటే ఇలా ఉండకూడదని ఈ వైద్యుడిని చూస్తే అర్థం అవుతుందని అంటున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రం లోని ప్రభుత్వ హాస్పటల్ లో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ వైద్యుడు నాగరాజు తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
డా. నాగరాజు
పిల్లల వైద్యం కోసం వచ్చిన తండ్రి
వైద్యం కావాలని వచ్చే పేషెంట్ల పట్ల దురుసుగా ప్రవర్తించారని డాక్టర్ ముందే పేషెంట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పరిధిలోని గోపాలకుంట గ్రామానికి చెందిన హుస్సేన్ తన పిల్లలకు జ్వరం రావటంతో కల్లూరు ప్రభుత్వ హాస్పటల్ కు తీసుకు వచ్చాడు. ఓపీ రాయించి పిల్లలను సదరు వైద్యుడి వద్దకు తీసుకువెళ్ళగా పిల్లలు మాస్క్ పెట్టుకు రాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓపీ స్లిప్ ను వారి మొహంపై పడేసి బయటకు వెళ్లగొట్టటంతో అక్కడే ఉన్న మరికొంత మంది పేషెంట్లు డాక్టర్ తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర జ్వరంతో వచ్చిన పిల్లలకు వైద్యం చేయకుండా బయటకు పంపించి వేయటం ఏంటని డాక్టర్ ను ప్రశ్నించారు.
Read Also: Earth Sagged : గోషామహల్‌లో కుంగిన పెద్ద నాలా.. పడిపోయిన దుకాణాలు, కార్లు
హాస్పిటల్ కు వచ్చే రోగుల పట్ల డాక్టర్ నాగరాజు అసభ్యంగా, అవమానకరంగా ప్రవర్తిస్తున్నాడని, ఇదేంటి అని ప్రశ్నిస్తే వీడియోలు తీసి పోలీస్ లతో కేస్ పెట్టిస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడని స్థానికులు వాపోతున్నారు.ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్లి వైద్యం చేయించుకునే స్థోమత లేక ప్రభుత్వ హాస్పిటల్ కు వస్తే వైద్యులు ఈ విధంగా వ్యవహరించటం కరెక్ట్ కాదని స్థానికులు అంటున్నారు. సదరు వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఘటన పై వైద్యుడు నాగరాజు ను వివరణ కోరగా స్థానికులు చేస్తున్న అరోపణలు తప్పని పూర్తి వివరాలను పోలీసులకు అందిస్తానని తెలిపారు.
Read Also: IPL Auction 2023 Live Updates: ఐపీఎల్ 2023 మినీ వేలం ప్రారంభం