మంచు మోహన్ బాబు వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు మంచు మనోజ్. మంచు కుటుంబంలో ఎంతో దైర్యంగా, సెల్ఫ్ డబ్బా కొట్టుకోకుండా మాట్లాడేది మంచు మనోజ్ మాత్రమే అని ఆయన అభిమానులు చెప్పుకొస్తారు. ఇక గత కొంత కాలంగా మనోజ్ జీవితంలో ఎన్నో ఊహించని ఘటనలు చోటుచేసుకున్న విషయం తెల్సిందే. తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వడం, సినిమాలను ఆపేయడం, టీడీపీ నేత కుమార్తె భూమా మౌనిక ను ప్రేమించడం.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం.. ఇలా అన్ని పెద్ద పెద్ద సంఘటనలు మనోజ్ జీవితంలో జరిగాయి. ఇప్పుడిప్పుడే మనోజ్ కొద్దిగా ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తున్నాడు. ఈ మధ్యనే ప్రేమించిన మౌనికను రెండో పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు. ఇక పెళ్లి తరువాత తన కెరీర్ ను మళ్లీ గాడిలో పెట్టడానికి ప్రయత్నాలు సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే మనోజ్ రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం వాట్ ది ఫిష్. వరుణ్ కోరుకొండ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
Pushpa 2: సుకుమార్ మావా.. శ్రీవల్లీని లేపేసావా అంటూ సోషల్ మీడియాలో రచ్చ.. ఎక్కడిది ఈ ఫోటో..?
ఇక రేపు.. అనగా మే 20 న మనోజ్ పుట్టినరోజు కావడంతో.. ఈ సినిమా నుంచి మనోజ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి బర్త్ డే విషెస్ చెప్పడానికి మేకర్స్ రెడీ అయ్యారు. ఈ విషయాన్నీ మనోజ్.. ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ” హలో అమేజింగ్ పీపుల్.. మనం కలుసుకొని చాలా రోజులు అయ్యింది.. రేపు సాయంత్రం 4 గంటలకు వాట్ ది ఫిష్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నామని చెప్పడానికి చాలా థ్రిల్ ఫీల్ అవుతున్నాను” అని చెప్పుకొచ్చాడు. ఇక దీంతో పాటు ఒక బ్లర్ ఫోటో ను కూడా షేర్ చేశాడు. బ్లాక్ అండ్ బ్లాక్ ల అద్దం వెనుక నిలబడి కనిపించాడు. ఇలా చూస్తే మనోజ్ ను గుర్తుపట్టడం కష్టమే. ఏదిఏమైనా మనోజ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమాతో మనోజ్ హిట్ అందుకుంటాడా లేదా చూడాలి.
Hello amazing people, It's been a while since we caught up, I'm thrilled to announce that #WhatTheFish first look glimpse will be releasing tomorrow! 🤩❤️
Stay tuned at 4pm for this SURPRISE 🤘😉#Varun @afilmbyv @6ixCinemas #AfilmbyV #MM #MMSaysWTF pic.twitter.com/sfoiy78xVF
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) May 19, 2023