Manchu Manoj: మంచు మనోజ్.. ఈ మధ్యనే తాను ప్రేమించిన భూమా మౌనికను రెండో వివాహం చేసుకొని సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. వ్యక్తిగతంగానే కాకుండా కెరీర్ లో కూడా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు.
మంచు మోహన్ బాబు వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు మంచు మనోజ్. మంచు కుటుంబంలో ఎంతో దైర్యంగా, సెల్ఫ్ డబ్బా కొట్టుకోకుండా మాట్లాడేది మంచు మనోజ్ మాత్రమే అని ఆయన అభిమానులు చెప్పుకొస్తారు. ఇక గత కొంత కాలంగా మనోజ్ జీవితంలో ఎన్నో ఊహించని ఘటనలు చోటుచేసుకున్న విషయం తెల్సిందే.