కర్ణాటక కాంగ్రెస్ లో సస్పెన్స్ కొనసాగుతుంది. ముఖ్యమంత్రి సీటుపై సిద్ధరామయ్య, డీకే శివ కుమార్ మధ్య గట్టి పోటీ నడుస్తుంది. దీంతో ఇప్పటికే ఇరువురు నేతలు సీఎం పీఠం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీంతో హైకమాండ్ నిర్ణయంపై అంతకంతకూ ఉత్కంఠత పెరుగుతుంది.
Also Read : NTR30: తారక్ ఫ్యాన్స్‌కి డబుల్ ధమాకా.. ఆరోజు మాస్ జాతరే!
కాంగ్రెస్ హైకమాండ్ నుంచి తనకు పిలుపు వచ్చిందని కేపీసీసీ చీఫ్ డీకే శివ కుమార్ తెలిపారు. తనకు ఇవాళ ( సోమవారం ) ఆరోగ్యం బాగలేకపోవడంతో రాలేక పోయానంటూ ఆయన వెల్లడించారు. రేపు ( మంగళవారం ) ఉదయం 7 గంటల నుంచి 8 గంటల మధ్య ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. సీఎం పదవికి తానే అర్హుడిని అంటూ డీకే గట్టిగా పట్టుబట్టారు. ముఖ్యమంత్రి పదవిని పంచుకునేందుకు డీకే సుముఖంగా లేకపోవడంతో ఏఐసీసీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు.
Also Read : Bhatti Vikramarka : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. నిరుద్యోగ భృతి 4 వేలు ఇస్తాం
అయితే మరోవైపు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఢిల్లీలో పార్టీ పెద్దలతో వరుసగా భేటీలు అవుతున్నారు. ఇప్పటికే మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో సమావేశం అవుతున్నారు. ఇప్పటికే మల్లికార్జున ఖర్గేతో డీకే శివ కుమార్ సోదరుడు సురేశ్ భేటీ అయ్యారు. అయితే డీకే కాస్త వెనక్కి తగ్గినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. దీంతో సిద్ధరామయ్య సీఎంగా ఆయన సహకరిస్తారంటూ వారు తెలియజేస్తున్నారు. సాయంత్రం 135 మంది ఎమ్మెల్యేలు తనకు సపోర్ట్ ఉన్నారని తెలిపాడు.. ఇప్పుడు అందరం కలిసి ముందుకు సాగుదాం అని డీకే చెప్పాడని కాంగ్రెస్ సీనియర్స్ అంటున్నారు.
Also Read : GT vs SRH: ముగిసిన గుజరాత్ బ్యాటింగ్.. సన్‌రైజర్స్ లక్ష్యం ఎంతంటే?
అయితే ఇప్పటికే సిద్ధరామయ్య తనకే సీఎం పదవి వస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి వచ్చిన పిలుపుతో డీకే శివ కుమార్ ఢిల్లీ పర్యాటన మూడు సార్లు వాయిదా పడింది. తనకు ఆరోగ్యం మెరుగుపడితే రేపు ఢిల్లీకి వెళ్తేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఒకవేళ డీకే శివ కుమార్ ఢిల్లీ వెళ్తే రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీని కలవనున్నారు. వీరితో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.