DK Shivakumar: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందుకుంది కాంగ్రెస్ పార్టీ.. అయితే, ఇద్దరు కీలక నేతలు ఉండడంతో.. ఎవరు సీఎం అనే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం కూడా తలపట్టుకుంటోంది.. ఎన్నికల ఫలితాలు వచ్చి మూడు రోజులు అవుతున్నా సీఎం ఎవరు అనే విషయం తేల్చలేదు.. మాజీ సీఎం సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ లో ఎవరినో ఒకరిని సీఎం పదవి వరించనుండగా.. ఎవరి బలం ఏంటి? ఎవరి బలహీనత ఏంటి? లాంటి విషయాలను బేరీజు వేస్తోంది కాంగ్రెస్ అగ్రనాయకత్వం.. ఇక, ఇప్పటికే మాజీ సీఎం సిద్ధరామయ్య హస్తినలో మకాం వేయగా.. పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది..
ఢిల్లీకి బయల్దేరి వెళ్లే ముందు మీడియాతో మాట్లాడిన డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. కాంగ్రెస్ పార్టీ నాకు తల్లిలాంటిది.. పిల్లలకు ఏం ఇవ్వాలో దేవుడికి, తల్లికి తెలుసు.. నేను నా దేవుడిని కలవడానికి గుడికి వెళ్తున్నాను అంటూ ఢిల్లీ పర్యటనను ఉందేశించి కామెంట్లు చేశారు.. నా డ్యూటీ నేను చేశాను.. నా పని కి నేను న్యాయం చేశానన్న ఆయన.. జనరల్ సెక్రటీరి నన్ను ఒక్కడినే రమ్మన్నారు.. అందుకే నేను మాత్రమే ఢిల్లీ వెళ్తునానని వెల్లడించారు. ఇక, ఈ రోజు సాయంత్రానికి ఎవరు సీఎం అని విషయం తెలుస్తుందని వెల్లడించారు డీకే శివకుమార్..
కాగా, సమాచారం ప్రకారం.. సీఎంతో పాటు కేబినెట్ మినిస్టర్స్ కూడా ఒకే రోజు ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లలో ఎవరో ఒకరిని సీఎం పదవి వరించనుండగా.. మంత్రుల కేటాయింపు కూడా ఆ నేతలకే చాయిస్‌లా ఉండబోతోందని తెలుస్తోంది.. ఓవైపు కర్ణాటక సీఎం పంచాయతీపై ఢిల్లీలో చర్చ జరుగుతుంటే.. మరోవైపు బెంగుళూరులో అధికారులు కొత్త ప్రభుత్వం కోసం అసెంబ్లీ, సచివాలయాన్ని సిద్ధం చేస్తున్నారు.. ఐదు గ్యారెంట్ స్కీమ్ పథకాలు అమలుకు కావాల్సిన ఫైల్స్ ను రెడీ చేస్తున్నారు అధికారులు. కొత్త ముఖ్యమంత్రి రాజ్ భవన్ లో ప్రమాణస్వీకారం ఉంటుందా లేదా బహిరంగ సభ ద్వారా చేస్తారనే చర్చ జరుగుతోంది..
మొత్తంగా ఐదు గ్యారంటీ స్కీమ్ హామీలపై తొలి సంతకం చేయబోతున్నారు కొత్త సీఎం.. 200 యూనిట్లు ఉచిత విద్యుత్, కోటిన్నర మహిళలకు నెలకు 2వేలు, బీపీఎల్ కుటుంబానికి ఉచితంగా పది కిలోల బియ్యం, నిరుద్యోగ భృతి గ్రాడ్యుయేట్‌లకు 3వేలు, డిప్లొమా హోల్డర్లకు 1,500, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇలా.. హామీలు నెరవేర్చాలంటే ప్రభుత్వానికి ఏటా రూ.62వేల కోట్ల ఖర్చు కానుంది.. కొత్త ప్రభుత్వానికి కాబోయే సీఎంకు ఇదొక కత్తమీదా సాము లాంటిదని ఆర్ధిక నిపుణులు చేబుతున్నారు.. మొత్తంగా కర్ణాటక సీఎం ఎవరు అనేది ఈ రోజు తేలిపోనుంది.