DK Aruna : ప్రభుత్వ పనితీరుని హైప్ చేయడానికే హైడ్రా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలంటూ డీకే అరుణ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇవాళ నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో ఎంపీ డీకే.అరుణ మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ పేరుతో రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వమని, రుణమాఫీ ఒక మోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులలో 30 శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదని ఆమె వ్యాఖ్యానించారు. నిబంధనల పేరుతో రైతులను అయోమయానికి గురిచేసి ఇంట్లో ఒకరికే రుణమాఫీ చేస్తామంటూ రేషన్ కార్డు అంటూ అడ్డమైన సాకులు చెప్తూ రైతన్నలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. హైదరాబాద్ లో హైడ్రా ఒక డ్రామా అని, గతంలో కేసీఆర్ కూడా ఇలానే అయ్యప్ప సోసైటీ ని కూల్చేశారన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాక ఇలాంటివి తెరమీదకు తీస్తున్నారని, హైడ్రా వెనుక ఏదో దాగి ఉందని ఆమె వ్యాఖ్యానించారు.
QG Gang War Trailer: ‘క్యూజీ గ్యాంగ్‌వార్’ ట్రైలర్ విడుదల.. అదరగొట్టేసిన ప్రియమణి, సన్నీలియోన్
Also Read
ఎన్నికల కోసమే హైడ్రా ఏర్పాటైందా అని, ప్రభుత్వాలు మారితే ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు గుర్తొస్తాయా అని ఆయన అన్నారు. ప్రభుత్వ పనితిరుని హైప్ చేయడానికే హైడ్రా అని, హైడ్రా పేరుతో హైడ్రామా వద్దన్నారు డీకే అరుణ. ప్రజలు ఇచ్చిన అవకాశాలను ప్రభుత్వాలు సద్వినియోగం చేసుకోవాలని, 111 జీవో కొనసాగించాలన్నారు. మక్తల్లో జరిగినంత ఇసుక దందా, మట్టి దందా ఎక్కడ జరగదేమోనని, పొలాలు, చెరువుల్లోని ఒండ్రుమట్టిని తరలిస్తుంటే ప్రభుత్వం ఎలా అనుమతులు ఇస్తోందన్నారు డీకే అరుణ. జిల్లా అధికారులకు కనపడటం లేదా,ఈ వ్యవహారం వెనుక ఉన్నది ఎవరు అని, చెరువు తోడేస్తుంటే అధికారులు, ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నట్లు అని ఆయన అన్నారు. చట్టాన్ని తుంగలో తొక్కి ఈ ప్రాంతాన్ని నాశనం చేస్తున్న మీరు స్పందించరా అని ఆమె అన్నారు. హైదరాబాద్ లో హైడ్రా సరే కానీ మక్తల్ చెరువుల సంగతి ఏంటి అని ఆమె అన్నారు.
Maharashtra: కూలిన 35 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం.. గతేడాది మోడీ ఆవిష్కరణ
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!