Diwali 2024: శ్రీరాముడికి హారతి ఇచ్చి దీపాలు వెలిగించిన ముస్లిం మహిళలు..
- శ్రీరాముడికి హారతి ఇచ్చి దీపాలు వెలిగించిన ముస్లిం మహిళలు
- వారణాసిలో ముస్లిం మహిళలు పూర్తి భక్తితో శ్రీరాముడికి హారతి
- గత కొన్నేళ్లుగా దీపావళి పండుగను ఇదే విధంగా జరుపుకుంటున్న మహిళా ఫౌండేషన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీపావళి.. ఒక్క మతానికో పరిమితం కాదు. చీకటిపై వెలుగు సాధించిన ఈ విజయాన్ని అందరూ జరుపుకుంటారు. వారణాసిలో ముస్లిం మహిళలు పూర్తి భక్తితో శ్రీరాముడికి హారతి ఇచ్చి.. ఆయన పేరిట దీపాలు వెలిగించడం దీనికి ఒక ప్రత్యేక ఉదాహరణ. వారణాసిలోని లాంహిలో ఉన్న ముస్లిం మహిళా ఫౌండేషన్ గత కొన్నేళ్లుగా దీపావళి పండుగను ఇదే విధంగా జరుపుకుంటుంది. ముస్లిం మహిళలు తమ చేతులతో ఉర్దూలో శ్రీరాముడికి హారతి ఇచ్చారు. ‘హే రాజా రామ్ తేరీ ఆరతి ఉతారు’ అనే కీర్తన కూడా పాడారు. ఈ క్రమంలో.. వారు యావత్ ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించారు. రాముని మార్గాన్ని అనుసరించడానికి ప్రేరేపించారు. ఈ సందర్భంగా ధర్మాచార్య మాట్లాడుతూ.. 2006లో వారణాసిలోని సంకట్ మోచన్ టెంపుల్ బాంబు ఘటన తర్వాత ఈ సంప్రదాయం ప్రారంభమైందన్నారు. రామనవమి, దీపావళి రోజున ముస్లిం మహిళలు ఆచారాల ప్రకారం శ్రీరాముని ఆరతిని నిర్వహిస్తారని ధర్మాచార్య చెప్పారు. దేశంలోని ప్రజలకు శాంతి, సౌభ్రాతృత్వం, శాంతి సందేశాన్ని అందించడమే దీని ప్రధాన లక్ష్యం అని అన్నారు.
Read Also: Mallikarjun Kharge: జమిలి ఎన్నికలు ఇండియాలో సాధ్యం కాదు
Also Read
- Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
- Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
ఇదిలా ఉంటే.. రష్యా-ఉక్రెయిన్ మధ్య, ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో ఈ ముస్లిం మహిళలు శ్రీరాముడి సందేశాన్ని అర్థం చేసుకోవాలని ఆ దేశాలకు సూచించారు. రాముడి మార్గాన్ని అర్థం చేసుకుంటే యుద్ధం ఆగిపోతుందని అన్నారు. రామరాజ్య దర్శనం ప్రజలందరినీ వివక్ష నుండి విముక్తి చేస్తుందని.. అందరినీ ఆలింగనం చేసుకోవడం గురించి మాట్లాడుతుందని ముస్లిం మహిళలు పేర్కొన్నారు. ఇజ్రాయెల్, పాలస్తీనా వంటి దేశాలు రాముడి బాటలో నడవాలన్నారు. ఏదేమైనాప్పటికీ, ఈ ముస్లిం మహిళలు శ్రీరాముడికి హారతి ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. రాముడు ఏ ఒక్క మతానికి పరిమితం కాదని వారి హారతితో నిరూపించారు.
Read Also: Ganja: పుష్ప సినిమా తరహాలో గంజాయి అక్రమ రవాణా.. 250 కేజీలు స్వాధీనం
తాజావార్తలు
-
Vijay Deverakonda: ‘రణబాలి’లో హింస ఎక్కువే.. కానీ ఆనాటి వాస్తవాలతో పోలిస్తే తక్కువే:
-
Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
-
Vijay Deverakonda: “బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!”.. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
-
Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!