దీపావళి.. ఒక్క మతానికో పరిమితం కాదు. చీకటిపై వెలుగు సాధించిన ఈ విజయాన్ని అందరూ జరుపుకుంటారు. వారణాసిలో ముస్లిం మహిళలు పూర్తి భక్తితో శ్రీరాముడికి హారతి ఇచ్చి.. ఆయన పేరిట దీపాలు వెలిగించడం దీనికి ఒక ప్రత్యేక ఉదాహరణ. వారణాసిలోని లాంహిలో ఉన్న ముస్లిం మహిళా ఫౌండేషన్ గత కొన్నేళ్లుగా దీపావళి పండుగను ఇదే విధంగా జరుపుకుంటుంది.