సాధారణంగా హిందూ సంప్రదామా ప్రకారం బయటికి వెళ్ళేటప్పుడు. మంచి కార్యం చేపట్టేటప్పుడు ముహూర్తం చూస్తూ ఉంటారు. అది అందరికి తెలిసిందే. పెళ్ళికి, కార్యానికి, రాకపోకలకు మంచి ముహర్తంలో జరిగితే మంచి జరుగుతుందని నమ్మకం. అన్నంకాన్నే ఒక వివాహిత సాకుగా మార్చుకొంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 ఏళ్లు భర్తకు దూరంగా ఉంది. భర్త దగ్గరకు వెళ్ళడానికి ముహూర్తం బాలేదని సాకు చెప్తూ 11 ఏళ్ళు కానిచ్చేసింది. దీంతో విసుగుచెందిన భర్త చివరికి కోర్టును ఆశ్రయించాడు. ఈ ఘటన ఛత్తీస్‌గడ్ లో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. జాంజ్‌గిర్‌కు చెందిన సంతోష్ సింగ్ అనే వ్యక్తికి 2010లో పక్క గ్రామానికి చెందిన మహిళతో వివాహమైంది. అనంతరం నవ వధువు అత్తవారింట్లో సంతోషంగా అడుగు పెట్టింది. నిండా 11 రోజులు కూడా కాలేదు.. నవ వధువును ఆమె తల్లిదండ్రులు పూజ చేయిస్తామని తీసుకెళ్లారు. అంతే సంగతులు 11 రోజులు కాస్తా 11 ఏళ్ళు అయిపోయాయి. ఎప్పుడు భార్యను తీసుకెళ్లడానికి అత్తగారింటికి వెళ్లినా ముహూర్తం బాలేదు.. ముహూర్తం చూసి పంపిస్తామని అత్తింటివారు.. ముహూర్తం బావున్నప్పుడు వస్తా అని భార్య చెప్పుకుంటూ వచ్చారు. ఆలా చూస్తూ చూస్తూనే 11 ఏళ్లు పూర్తయ్యాయి. దీంతో విసిగిపోయిన సంతోష్.. తన భార్య నుంచి విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించాడు. ఇక వాదోపవాదనలు విన్న కోర్టు భర్తను సపోర్ట్ చేస్తూ విడాకులు మంజూరు చేసింది. ఒక చిన్న కారణం వలన విడిపోయిన జంటగా వారిద్దరి పేర్లు స్థానికంగా హాట్ టాపిక్ గా మారాయి.