రాష్ట్రంలోని సలహాదారులను అందర్నీ ఏపీ ప్రభుత్వం తొలగించింది. మొత్తంగా 40 మంది సలహాదారులను తొలగిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 4వ తేదీ నుంచి తొలగింపు ఉత్తర్వుల్లో జీఏడీ వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ కీలక ఆదేశాలు చేసింది. కీలక ఫైళ్లను ప్రాసెస్ చేయొద్దంటూ రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే.. రెవెన్యూ శాఖ పరిధిలోని కాంట్రాక్టర్లకు నిధుల విడుదల, భూ కేటాయింపుల వంటి ఫైళ్లని నిలుపుదల చేయాలని ఆదేశాలు ఇచ్చారు. రెవెన్యూ మంత్రి పేషీలోని రికార్డులు, ఫైళ్లను జాగ్రత్త పరచాలని పేషీ సిబ్బందికి సూచించింది.
జూన్ 4వ తేదీన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. అనంతరం ఏపీలో నూతన ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ క్రమంలోనే జూన్ 3వ తేదీన మంత్రుల పేషీలు, ఛాంబర్లను జీఏడీ హ్యాండోవర్ చేసుకోనుంది
ఏపీలో విద్యుత్ బకాయిలు చెల్లించాల్సిందిగా ఉద్యోగులకు జీఏడీ నోటీసులు ఇచ్చారు. ఉచిత వసతి సౌకర్యం పొందుతున్న ఉద్యోగులు అదనంగా వినియోగించిన కరెంట్ ఛార్జీలను చెల్లించాలని జీఏడీ లేఖ రాసింది. ఆ లేఖలో.. సెక్రటేరీయేట్, హెచ్ఓడీల ఉద్యోగులకు కల్పించిన ఉచిత వసతి భవనాల్లో పరిమితికి మించి విద్యుత్ వాడుకున్నారని జీఏడీ ప్రస్తావించింది. రెయిన్ ట్రీ పార్క్, చిల్లపల్లి, నవులూరు, ఎమరాల్డ్ పార్క్, ఉండవల్లి, గొల్లపూడి వద్ద ఉద్యోగులకు కేటాయించిన అపార్టుమెంట్లలో అదనంగా విద్యుత్ వినియోగించుకున్నారని తెలిపింది.