పెద్ద నోట్లు రద్దు అయినా తరువాత నుంచి డిజిటల్ పేమెంట్లు వాడకం పెరిగిపోయింది. పెద్ద పెద్ద నగరాల్లో, పట్టణాల్లో ఎక్కువగా పేమెంట్లు జరుగుతాయి. అయితే.. నగరాలు, పట్టణాల్లో డిజిటల్ పేమెంట్స్ పెద్ద మొత్తంలో జరుగుతోండగా.. ఇప్పుడిప్పుడే గ్రామాలకు కూడా చిన్నచిన్నగా విస్తరిస్తోంది. రోడ్డుపైన తినుబండారాలు అమ్ముకునే వ్యాపారుల నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ప్రతీఒక్కరూ డిజిటల్ పేమెంట్స్‌ను బాగా వినియోగించుకుంటున్నారు. నిమిషాల్లో ట్రాన్సక్షన్లు నిర్వహించుకునే అవకాశం ఉండటం, బ్యాంకు లావాదేవీలు సులువు అవుతుండటంతో ఎక్కువమంది డిజిటల్ పేమెంట్స్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే.. ఇంటి నుంచి బయటకు వెళ్లామంటే చాలా మంది యాచకులు మనకు కనిపిస్తారు.
Also Read : Jayaho BC Maha Sabha Live: జయహో బీసీ మహాసభ లైవ్ అప్‌డేట్స్
దేవాలయాలు, కూడళ్లు వద్ద భిక్షాటన చేస్తూ జీవిస్తారు. యాచకులు ఎవరైనా డబ్బులు అడిగితే.. చిల్లర లేదని చాలా మంది సమాధానం చెబుతారు. ఐతే ఈ చిల్లర కష్టాలకు చెక్ పెడుతూ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తున్నారు యాచకులు. ఏకంగా డిజిటల్ భిక్షాటన చేస్తున్నారు. అవును.. హైదరాబాద్‌లో దానం చేయడానికి చిల్లర లేదా.. అయితే.. ఫోన్ పే, గూగుల్ పే చేయండి అంటూ.. బార్ కోడ్ స్కానర్‌ను చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. హిజ్రాలతే డిజిటల్ పేమెంట్స్ చేసేవరకు వదిలిపెట్టడం లేదు..