విజయవాడలో డయేరీయా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.. తెల్లారేసరికి 30 డయేరియా కేసులు ఒకే ఏరియాలో రావడంతో, అక్కడి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు... ఇప్పటి వరకూ ఏడు పదుల వరకూ కేసులు నమోదు కావడంతో కారణాలను తెలుసుకునే పనిలో పడింది ప్రభుత్వం.. అధికారులు సైతం క్షేత్రస్ధాయిలో ప్రతీ అంశాన్నీ టెస్టులు చేస్తున్నారు... మొత్తం అధికార యంత్రాంగం అంతా విజయవాడ కొత్త రాజరాజేశ్వరి పేటలోనే ఉంటోంది..