Dhoni : మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ చరిత్రలో ఓ ధృవతార. అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చి మూడేళ్లు పూర్తయింది. అతను ఐపిఎల్ నుండి రిటైర్మెంట్ అవుతున్నాడంటూ ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే అతని అభిమానులు ధోని ఆట గురించి ఎక్కువగా చర్చిస్తున్నారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లోనూ చెన్నై సూపర్‌కింగ్స్‌కు ధోనీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. చెన్నైలో ప్రేక్షకుల ముందు ఆడిన తర్వాతే రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నట్లు ధోనీ గతేడాది చెప్పాడు.
Read Also: R Ashwin Daughter : తండ్రి అవుటవ్వగానే బోరున ఏడ్చేసిన కూతురు
ధోనీ ఈ సీజన్‌లో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో కూడా ఆడాడు. అయితే ఇప్పుడు ధోనీ రిటైర్మెంట్ తీసుకుంటాడా ? అన్న చర్చ కొనసాగుతున్న తరుణంలో రిటైర్మెంట్‌పై ధోనీ స్వయంగా ఓ విషయం చెప్పాడు. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్‌కు సంబంధించిన ఒక ఈవెంట్‌లో ధోని ఐపిఎల్ నుండి రిటైర్మెంట్ గురించి ఒక ప్రశ్న అడిగారు. దీనిపై ధోనీ మాట్లాడుతూ, దీనిపై (రిటైర్మెంట్) నిర్ణయం తీసుకోవడానికి ఇంకా చాలా సమయం ఉంది. ప్రస్తుతానికి తాను IPL 2023లో చాలా మ్యాచ్‌లు ఆడవలసి ఉంది. ఇప్పుడు తాను ఏదైనా చెబితే కోచ్ ఒత్తిడికి లోనవుతారని చెప్పారు.
Read Also:Harish Rao: అప్పుడు మాటిచ్చాం.. ఇప్పుడు నెరవేర్చాం..